థియోటర్ రిలీజ్ లు లేక ఇప్పుడిప్పుడే కొంతమంది నిర్మాతలు ఓటీటిలు వైపు మ్రొగ్గు చూపుతున్నారు. అయితే థియోటర్ ఆలోచనే లేకుండా డైరక్ట్ గా ఓటీటి కోసమే కొన్ని సినిమాలు తయారవుతున్నాయి. అలాంటి సినిమా ఇది. సినిమాల్లో పెద్దగా మార్కెట్ లేని నవదీప్ నటించిన ఈ సినిమా ఆహా ఒరిజినల్ పేరుతో ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా విడుదలైంది. ఒక హత్య..ఆరుగురు అనుమానితులు అంటూ ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసి ప్రయత్నం చేసిన ఈ థ్రిల్లర్ లో నిజంగానే ఆ స్దాయి మేటర్ ఉందా...ఓటీటిలో అయినా సమయం వెచ్చించి చూడదగ్గ సినిమాయేనా..ఎవరు ఎవరిని హత్య చేసారు...సినిమాలో క్యారక్టర్స్ నా చూడటానికి ల్యాప్ టాప్ ముందు కూర్చున్న ప్రేక్షకులనా రివ్యూలో చూద్దాం.

కథ ఏంటి
ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య శృతి (పూజిత పొన్నాడ)తో హ్యాపీ లైప్ లీడ్ చేస్తూంటాడు సందీప్ (నవదీప్). అయితే ఆ ఆనందం ఏడాదికే ముగిసిపోతుందని అతనికి తెలియదు. ఫస్ట్ వెడ్డింగ్ యానవర్శరీ రోజే సందీప్ భార్య చనిపోతుంది. ఆత్మహత్య అని అనుకున్నా పోలీస్ లు ఎంట్రీ తో అది హత్య అని తేలుతుంది. పోలీస్ లు మొదట సందీప్ నే అనుమానిస్తారు. అందుకు తగ్గ ఆధారాల కోసం వెతుకుతూంటారు. అయితే సందీప్ తను ఎంతో ప్రేమించే శృతిని ఎందుకు చంపుతానని వాదిస్తాడు. కానీ వాళ్లు వినరు. అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోబోతారు. దాంతో తను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవటానికి, అసలు హంతకులు ఎవరో పట్టుకోవటానికి పోలీస్ ల నుంచి తప్పించుకోవటానికి పరుగు మొదలెడతాడు. అలా తప్పించుకునేందుకు అతనికి ఓ స్నేహితుడు సాయిపడతాడు.ఈ క్రమంలో కొన్ని ఊహించని నిజాలు బయిటపడతాయి. అవేమిటి..శృతి ని హత్య చేసిన అసలు హంతకుడు ఎవరు.? ఆ స్నేహితుడుకు ఈ హత్యకు సంభంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ‘రన్’ చూడాల్సిందే.
undefined
ఎలా ఉంది
సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే పెట్టుకుని దాని చుట్టు కథ అల్లుకున్నారు. ఆ క్లైమాక్స్ చేరేదాకా జరిగే ప్రయాణం అంతా నత్త నడకే. టైటిల్ పేరుకు రన్ అనే కాని సినిమాలో సన్నివేశాల్లో ఎక్కడా ఆ స్పీడు ఉండదు. సినిమా ప్రారంభమై గంట సేపు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంటుంది పరిస్దితి. దాంతో చాలా మంది క్లైమాక్స్ దాకా చూస్తారనుకోను. సీన్స్ రిపీట్ అవుతున్నా టైమ్ ఫిల్లింగ్ కోసం అన్నట్లుగా పట్టించుకోలేదు. అయినా అలా ఎడిట్ చేసేస్తే ఓ షార్ట్ ఫిలిం లా తయారు అవుతుందని ముందే గ్రహించినట్లున్నారు. ఇక మేకింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. యూట్యూబ్ లో కొత్తగా షార్ట్ ఫిల్మ్ లు తీసేవాళ్లు ఇంత నాశిరకమైన క్వాలిటీతో తీయటం లేదు. బడ్జెట్ లేకో లేక ఎందుకులే తీసేది ఓటీటీ కే కదా అనుకున్నారో కానీ నిర్మాణవిలువలు నాస్తి.
టెక్నికల్ వ్యాల్యూస్ అంతంత మాత్రం. నటీనటుల్లో నవదీప్ మంచి నటుడే కానీ అతన్ని ..ఇలాంటి తలా తోక లేని కథలో భరించటం కష్టం. సినిమా క్లైమాక్స్ చూడలేదు అనుకునే వాళ్లకు చిన్న క్లూ... A Beautiful Mind (2001) సినిమాకు ఇది ఓ వెర్షన్. దాన్ని బట్టి అర్దమైన మేరకు అర్దం చేసుకోండి. ఎక్కువ అర్దం చేసుకోకుండి.ఎందుకంటే అక్కడ అంత సీన్ లేదు. ఇక నటీనటుల్లో చాలా కాలం గ్యాప్ తరువాత స్క్రీన్ పై కనిపించిన నటుడు వెంకట్ పోలీస్ రోల్ లో బాగున్నారు. మంచి ఫిజిక్ తో ఫెరఫెక్ట్ గా ఉన్నారు. సపోర్టింగ్ రోల్స్ లో భానుశ్రీ, షఫీ ఓకే అనిపించుకున్నారు. ఇక సినిమా ఎలా ఉన్నా బీజీఎమ్ మాత్రం అదరకొట్టాడు.
ఫైనల్ థాట్
ఇలాంటి సినిమాలు కావాలని రిలీజ్ చేసి, ఓటీటిలపై మోజు తగ్గటానికి నిర్మాతలు చేస్తున్న కుట్ర కాదు కదా.
--సూర్య ప్రకాష్ జోస్యుల
Rating : 1/5