నాని ‘దసరా’ నుంచి అఫిషియల్ అప్డేట్ అందింది. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న Dasara Trailer సిద్ధమైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
నేచురల్ స్టార్ నాని (Nani) మునుపెన్నడూ లేనివిధంగా ఊరమాస్ అవతార్ లో అలరించబోతున్నాడు. ‘దసరా’తో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ అందించనున్నారు. నాని - కీర్తి సురేష్ (Keerthy Suresh) మరోసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా చిత్రం నుంచి మాస్ ట్రైలర్ ను రెడీ చేసినట్టు మేకర్స్ అప్డేట్ అందించారు. ఇప్పటికే ఫ్యాన్స్ దసరా ట్రైలర్ కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా డేట్ ఫిక్ చేసి అధికారికంగా ప్రకటన చేశారు. మార్చి 14న విడుదల చేయబోతున్నామని, అభిమానులు.. ప్రేక్షకులకు జాతర షురూ కానుందని నాని అప్డేట్ అందించారు. బిగ్ అనౌన్స్ మెంట్ అందిస్తూ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పదితలలా రావణసురుడి భారీ విగ్రహానికి నిప్పంటుకోగా.. విగ్రహం ఎదుట నాని నిల్చుని ఉన్నారు. చేతిలో రెండు గొడ్డళ్లు పట్టుకొని ఆవేశంగా విగ్రహానే చూస్తున్నాడు.
పోస్టర్ గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. దీంతో సినిమాలో ఒక్కో ఫ్రేమ్ ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చి టీజర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరగనున్నాయి. పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ‘ధూమ్ ధాం దోస్తాన్’,‘ఓరివారి’, ‘ఛంమ్కీలా ఆంగీలేసి’ సాంగ్స్ దుమ్ములేపుతున్నాయి. ప్రస్తుతం ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.
నానికి ‘దసరా’ తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో ప్రమోషన్స్ ను దగ్గరుండి చూసుకుంటున్నారు. నార్త్, సౌత్ లోని ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో మార్చి 30న ఈ వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.