Nagababu: మంచు ఫ్యామిలీని మళ్ళీ గెలికిన నాగబాబు..! 

Published : Apr 27, 2022, 08:10 AM IST
Nagababu: మంచు ఫ్యామిలీని మళ్ళీ గెలికిన నాగబాబు..! 

సారాంశం

ఛాన్స్ దొరికితే చాలు మంచు ఫ్యామిలీపై విరుచుకుపడిపోతాడు నాగబాబు. మా ఎన్నికల కారణంగా రగిలిన వివాదాన్ని నాగబాబు కొనసాగిస్తున్నాడు. తాజాగా మోహన్ బాబు సినిమాపై పరోక్షంగా సెటైర్స్ వేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.   

మంచు మెగా ఫ్యామిలీ మధ్య వివాదం ఇప్పటిది కాదు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల సమయంలో అవార్డులు విషయమై గొడవ జరిగింది. చిరంజీవి(Chiranjeevi)కి లెజెండరీ పురస్కారం ఇచ్చి, మోహన్ బాబుకు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మోహన్ బాబు కామెంట్స్ పై చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాలలో సీరియస్ అయ్యారు. అది జరిగి ఏళ్ళు గడిచిపోగా... ఈ మధ్య చిరంజీవి-మోహన్ బాబు సన్నిహితంగా కనిపించారు. ఒకరినొకరు తరచుగా కలవడం, టూర్స్ కి వెళ్లడం, బహుమతులు ఇచ్చుకోవడం చేశారు. 

అయితే 'మా' ఎన్నికలు మరలా రెండు కుటుంబాల మధ్య అగ్గిరాజేశాయి. మెగా ఫ్యామిలీ మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ కి సప్పోర్ట్ చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే చిరంజీవి అంకుల్ నన్ను ఎన్నికల నుండి తప్పుకోమన్నారంటూ మంచు విష్ణు ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఇక ఈ ఎన్నికల సమయంలో నాగబాబు, మంచు విష్ణు, మోహన్ బాబు మధ్య జరిగిన మాటల యుద్ధం, ఆరోపణలు గురించి తెలిసిందే. అవి తారాస్థాయికి చేరాయి. వ్యక్తిగత దూషణలు కూడా చేసుకున్నారు.
 
ప్రకాష్ రాజ్ ఓటమి నాగబాబు(Nagababu)ను తీవ్ర ఆవేదనకు ఆవేశానికి గురి చేసింది. ఆ క్రమంలో ఆయన మా సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసి చాలా కాలం అవుతున్నా వివాదం కొనసాగుతూనే ఉంది. నాగబాబు తాజాగా మోహన్ బాబు సినిమాను ఉద్దేశిస్తూ వ్యగ్యాస్త్రాలు వదిలారు. తన అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న మోహన్ బాబుని ఒకరు కెజిఎఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అని అడిగారు. 

దానికి నాగబాబు రెండూ కాదు ఓ లెజెండరీ గ్రాఫిక్స్ మూవీ అంటూ సమాధానం చెప్పారు. నాగబాబు చేసిన ఈ కామెంట్ మోహన్ బాబు (Mohan babu)లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా గురించే అని తెలుస్తుంది. సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్ బాబు ఓ సాంగ్ గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నాగబాబు సెటైర్ వేశారనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సన్ ఆఫ్ ఇండియా మూవీ కనీస ఆదరణ దక్కించుకోలేదు. ఆ చిత్ర ఫలితాన్ని నాగబాబు పరోక్షంగా ఎగతాళి చేశాడనేది కొందరి అభిప్రాయం. ఈ మధ్య వ్యంగ్యాస్త్రాలకు పెట్టింది పేరుగా తయారైన నాగబాబు ప్రత్యర్థులను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?