ఇక బోళాశంకర్ పై దృష్టి పెట్టిన చిరంజీవి, మెగాస్టార్ దూకుడు మామూలుగా లేదు కదా..

Published : Jun 11, 2022, 04:31 PM IST
ఇక బోళాశంకర్ పై దృష్టి పెట్టిన  చిరంజీవి, మెగాస్టార్ దూకుడు మామూలుగా లేదు కదా..

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి దూకుడు మామూలుగా లేదు.  వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్న చిరంజీవి.. కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా చిరు భోళా శంకర్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా రూపొందుతోంది. గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టే.. ఇక  ఈమూవీ తరువాత వాల్తేర్ వీరయ్య,భోళా శంకర్ సినిమాలను చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. గాడ్ ఫాదర్ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెడుతున్నారు.

రీసెంట్ గా ఆచార్య సినిమాతో పెద్ద దెబ్బ తిన్నాడు మెగాస్టార్. ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన మెగా మూవీ నిరాశపరచడంతో.. ఉలిక్కి పడ్డాడు. ఆ బాధనుంచి బయటపడేందుకు చిరు.. సతీసమేతంగా ఓ నెల రోజులు ఫారెన్ టూర్ వెళ్ళారు. అయితే ఈ మూవీ నుంచి నేర్చుకున్న విషయాలను తన నెక్ట్స్ సినిమాలకు వాడుతున్నారట చిరు. దాని కోసం తన సినిమా డైరెక్టర్లందరిని కథతో పాటు సినిమా కూడా మరోసారి చెక్ చేసుకోమన్నారట. 
 
 ఇక ఈ క్రమంలోనే  వేదాళం సినిమాకి రీమేక్మ గా.. భోళా శంకర్ మూవీ తెరకెక్కుతోంది.  రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భోళా శంకర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ మధ్య చిత్రీకరించారు. ఇక నెక్ట్స్ షెడ్యూల్ ష‌ూటింగ్ ను  ఈ నెల 21వ తేదీ నుంచి ప్లాన్ చేశారట. ఆ రోజు నుంచి చిరంజీవి తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని సమాచరం. 

ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతూ ఉండటంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మేకర్స్ ఈ ప్రకటన చేశారు. చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా.. తమన్నా కనువిందు చేయనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను రిలీజ్  చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?