
ఈమధ్య మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త.. చైతన్య తో తెగదెంపులు చేసుకుంది అంటూ న్యూస్ వైరల్ అవుతున్నక్రమంలో.. ఆయన స్వయంగా బావ మరిది వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి కూడా రాకపోవడంతో.. ఇక వీరి విడిపోతున్నారు అన్న న్యూస్ ను ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. వీరిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది.. పక్కాగా విడిపోయి ఉంటారు అంటూ.. అనకుంటున్నారు. అందులోనూ మెగా అకేషన్స్ ఏందులోనూ చైతన్య కనిపించడం లేదు. పెళ్ళి ఫోటోలు కూడా సోషల్ మీడియా పేజ్ నుంచి డిలెట్ చేశారు. దాంతో డివోర్స్ పక్కా అని ఫిల్మ్ నకర్ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం.
అయితే చాలా కాలంగా చైతన్య యాక్టీవ్ గా లేడు. గత నాలుగు నెలలుగా చైతన్య సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. మరి ఆయన ఏమైపోయాడు అన్న ప్రశ్న నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో.. చైతన్య చివరి పోస్ట్ పెట్టాడు. ఆతరువాత అతను ఒక్క పోస్ట్ పెట్టలేదు. విడాకుల వార్తలపై స్పందించలేదు కూడా.. ఇక మళ్లీ నాలుగు నెలల తరువాత మళ్ళీ ఇప్పుడు చైతన్య పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.
చైతన్య ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటో షేర్ చేస్తూ.. “ఇక్కడికి నన్ను వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇక ఇది చాలా కొందిమంది లైఫ్ లో జరుగుతుంది. ఆలా నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు నుంచి విపస్సనా యోగను చేయడం వల్ల నా లైఫ్ ఇప్పుడు కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.
2020 డిసెంబర్ 9న జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల మధ్య రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తరువాత ఓ రెండేళ్ల పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు.ఇక వీరి మధ్య మనస్పర్థలు.. రాబట్టే ఆయన ఇలా మనశ్శాంతి కోసం యోగాశ్రమంలో చేరినట్టు తెలుస్తోంది. చైతన్య బాధలో ఉన్నట్టు గ్రహించిన నెటిజన్లు.. ఆయనకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. చైతన్యను ఓదారుస్తున్నారు.