భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ షూటింగ్ అప్డేట్.. నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?

Published : Jun 04, 2022, 05:07 PM IST
భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ షూటింగ్ అప్డేట్.. నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?

సారాంశం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న భారీ చిత్రాల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ ఒకటి.. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.  తాజాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ పై అప్డేట్ అందింది.  

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. చివరిగా ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకులను, అభిమానులకు కాస్తా అప్సెట్ చేసిన ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ మరియు ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అయితే మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth) ఇప్పటికే ‘కేజీఎఫ్’తో క్రియేట్ చేసిన సెన్సేషన్ తో.. ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

కాగా, Salaar నిర్మాత విజయ్ కిరగందూర్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ సినిమా 35 శాతం షూటింగ్ పూర్తి అయిందని తెలియజేసారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రతి నెలా పదిహేను  రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది కాకుండా ప్రతి నెలా వారం రోజులు ఆయన అవసరం లేని సీన్స్ ని చిత్రీకరిస్తారు. అలాగే ‘సలార్‌’ యాక్షన్‌ అత్యద్భుతంగా ఉంటుందని హామీనిచ్చారు. ఈ రోజు ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ హార్ట్ ఫుల్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా సలార్ సెట్ నుంచి క్రేజీ పిక్  ను కూడా షేర్ చేశారు. 

అయితే ఇప్పటికే సలార్ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సందర్భంగా లేటెస్ట్ షెడ్యూల్ పై అప్డేట్ అందింది.  ఈ నెల 8 నుంచి మరో షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కూడా ప్రశాంత్ నీల్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సలార్ నుంచి లీక్ అయిన ఫొటోస్, లోకేషన్ పిక్స్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా హీరోయిన్ శ్రుతిహాసన్‌ (Shruthi Haasan) నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మలయాళం యాక్టర్  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.  శ్రద్ద కపూర్‌తోనూ ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక రవి బస్రూర్‌ అద్భుతమైన సంగీతం అందిస్తుండగా, భువన్‌ గౌడ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై  ఈ సినిమాను రూ.200 నుంచి రూ.250 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు.  

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?