జ్యోతిక ‘మగువలు మాత్రమే’ రివ్యూ

By Surya Prakash  |  First Published Sep 11, 2020, 6:07 PM IST


 కరోనా టైమ్ లో సినిమాలకు కరువు వచ్చేసింది. షూటింగ్ లు లేవు, రిలీజ్ లు లేవు. దాంతో కరోనా రాకముందు.. షూటింగ్ పూర్తి చేసుకున్న అనేక తెలుగు సినిమాలకు మోక్షం కలుగుతోంది. రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నవి కూడా  ఓటీటీ వేదికలుగా విడుదలవుతున్నాయి. అయినా సరే ఓటీటీలకు కంటెంట్ కావాల్సినంత దొరకటం లేదు. అందరూ రామ్ గోపాల్ వర్మలా ఉత్సాహంగా సినిమాలు వరస పెట్టి తీయటం లేదు కదా. దాంతో ఒక అడుగువేసి.. ఆహా వంటి ఓటీటీ సంస్థలు కూడా ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలను డబ్‌ చేసి విడుదల చేస్తున్నాయి. అలా జ్యోతిక, ఊర్వశి, భానుప్రియ, శరణ్య పొన్నన్‌ కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మగలిర్‌ మట్టుం’ తెలుగులో మన ముందు వాలింది. 2017లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి టాక్‌,రివ్యూలు తెచ్చుకుంది. తాజాగా తెలుగులో ‘మగువలు మాత్రమే’ పేరుతో డబ్‌ అయి, ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి..చూడదగ్గ వ్యవహారమేనా అనేది రివ్యూలో చూద్దాం.


కరోనా టైమ్ లో సినిమాలకు కరువు వచ్చేసింది. షూటింగ్ లు లేవు, రిలీజ్ లు లేవు. దాంతో కరోనా రాకముందు.. షూటింగ్ పూర్తి చేసుకున్న అనేక తెలుగు సినిమాలకు మోక్షం కలుగుతోంది. రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నవి కూడా  ఓటీటీ వేదికలుగా విడుదలవుతున్నాయి. అయినా సరే ఓటీటీలకు కంటెంట్ కావాల్సినంత దొరకటం లేదు. అందరూ రామ్ గోపాల్ వర్మలా ఉత్సాహంగా సినిమాలు వరస పెట్టి తీయటం లేదు కదా. దాంతో ఒక అడుగువేసి.. ఆహా వంటి ఓటీటీ సంస్థలు కూడా ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలను డబ్‌ చేసి విడుదల చేస్తున్నాయి. అలా జ్యోతిక, ఊర్వశి, భానుప్రియ, శరణ్య పొన్నన్‌ కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మగలిర్‌ మట్టుం’ తెలుగులో మన ముందు వాలింది. 2017లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి టాక్‌,రివ్యూలు తెచ్చుకుంది. తాజాగా తెలుగులో ‘మగువలు మాత్రమే’ పేరుతో డబ్‌ అయి, ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి..చూడదగ్గ వ్యవహారమేనా అనేది రివ్యూలో చూద్దాం.

 కథేంటి
నిజానికి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కథేమీ లేదు. సంసారంలో ఈదులాడుతున్న ముగ్గురు మహిళలు మూడు రోజుల పాటు తమ కోసం తాము బతికితే ఎలా ఉంటుందన్న విషయానికి సునిశిత హాస్యం జోడించి వడ్డించారు. ఈ ముగ్గరు అమ్మాయిలని కలిపే కనెక్షన్ ..  ప్రభావతి (జ్యోతిక). ప్రభా ఈ జనరేషన్ అమ్మాయి. ఇండిపెండెంట్ ఉమెన్.,ఆడవాళ్ల మీద, వాళ్ల మొగుళ్లుతో పడే కష్టాలపైనా డాక్యుమెంటరీలు చేస్తూంటుంది. ఆమె ఎప్పుడూ తన కాబోయే అత్తగారు గోమాత (ఊర్వశి)తో సరదా,సరదాగా కబుర్లు చెప్తూంటుంది. ఆమెను ఎంగేజ్ చేస్తూంటుంది. 

Latest Videos

అలా జరుగుతూంటే ఓ రోజు సదరు అత్తగారు గోమాత ...ఓ రోజు పెద్ద నిట్టూర్పు నిట్టూరుస్తుంది. ఏమిటా నిట్టూర్పు అంతరార్దం అంటే... తన చిన్నప్పటి దోస్త్ లు, క్లాస్ మేట్స్ గుర్తు వచ్చారు. ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం క్రిష్టియన్ స్కూల్లో చదివేటప్పుడు ఆమెకు ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్.  వాళ్లు సుబ్బలక్ష్మి(శరణ్య) , రాణి అమృతకుమారి(భానుప్రియ).వాళ్లిద్దరితో గోడదూకి సినిమాలు, క్లాస్ లు ఎగ్గొట్టి కబుర్లు, ప్రిన్సిపల్ రూమ్ నుంచి దొంగ చాటు ఫోన్స్. అవన్నీ అప్పుడప్పుడూ గుర్తు వస్తూంటాయి. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో..ఏం చేస్తున్నారో అనిపిస్తూంటుంది. ఆ విషయాన్ని తన కాబోయే కోడలు అడగ్గా అడగ్గా చెప్తుంది.

 దాంతో అది విన్న కోడలు తిన్నంగా ఉంటుందా..అత్తా ..నీ చిత్తాన్ని ఆక్రమించిన సదరు స్నేహితులను ఏ లోకాలలో ఉన్నా పట్టుకుంటాను అని ఫేస్ బుక్ లోకంలో ప్రవేశించి ఇట్టే పట్టేస్తుంది. వాళ్లతో ఛాటింగ్ చేసి, పోన్ నెంబర్ లు సంపాదిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి వీళ్లు  ఎక్కడున్నారో ఒకరికి ఒకరు తెలిసాక..కలవాలనిపిస్తుంది కదా. కానీ వాళ్లకు అనిపించిందో లేదో కానీ మన కాబోయే కోడలు ప్రభాకు అనిపిస్తుంది. వెంటనే రంగంలోకి దిగి వాళ్లకు ఫోన్ చేస్తుంది. కానీ వాళ్లంతో మొగడు, పిల్లలు, మనవలు అన్న కాన్సెప్ట్ లో చాలా బిజీగా ఉంటారు. మరేం చేయాలి.

 ఒప్పించి ఒకరిని, మరొకరిని, కిడ్నాప్ చేసి..  మూడు రోజులు పాటు సరదాగా రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. దీని మూలంగా మన ప్రభావతి అక్క ఏం సాధిస్తుంది అని అడగొద్దు. ఆమెకు అదో సరదా అయ్యిండవ్చు. లేదా కాబోయే అత్తగారి మెప్పు పొందాలని అయ్యిండవచ్చు. అదీ ఏదీ కాకపోతే...సాటి ఆడవాళ్లపై సానుభూతి తో అయ్యిండవచ్చు. ఆమె మనస్సులో ఏముందనేది ప్రక్కన పెడితే..అలా చెప్పాపెట్టకుండా  సంసారాలని వదిలేసి పూర్తి భాథ్యత మోసే ముగ్గురు ఫ్యామిలీ లేడీస్..ఒక్కసారిగా బయిటకు వచ్చేస్తే ...ఆ కుటుంబాల్లో ఎన్ని గొడవలు, సునామీలు.. ఆ తర్వాత ఏమైంది... అంటే వెండితెరపై చూడుడు..సారీ మీ ల్యాప్ టాప్ లో ఆహ్ యాప్ ఓపెన్ చేసి చూడండి. 
 
కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయంటే

అప్పుడెప్పుడో హాలీవుడ్ లో Thelma & Louise అనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాకు దీనికి సంభందం లేదు కానీ అక్కడా స్వేచ్చ కోసం ఇద్దరు నడివయస్సు స్త్రీలు ప్రపంచంలోకి అడుగుపెడ్తారు. ఇక్కడా అదే జరుగుతుంది. రొటీన్ లైఫ్ నుంచి తమను తాము ఆవిష్కరించుకోవటానికి రోడ్ ట్రిప్ లోకి వస్తారు. అయితే ఇక్కడ జ్యోతిక అనే అమ్మాయి...వీళ్లను బలవంతంగా బయిటకు లాక్కెళ్లాల్సి వస్తుంది. ఎందుకలా అంటే అంతలా ఆ ఆడవాళ్లు వంటింటికు, ఫ్యామిలీ మెంబర్స్ కు ట్యూన్ అయ్యిపోయారు. వాటినుంచి ఎవరో ఒకరు బయిటపడేయాల్సిన అవసరం వస్తోంది. తమంతట తాము రియలైజ్ అయ్యే స్ధితి లేదు. ఇక రోడ్ ట్రిప్ లో ఏవైనా అవాంతరాలు వస్తే బాగుండేది. 

కానీ అలాంటివేమీ డైరక్టర్ పెట్టుకోదలిచినట్లు లేరు. ఇక ఇది జ్యోతిక సినిమా అనటానికి లేదు. ఎందుకంటే ఆమె ఓ కేటలిస్ట్ క్యారక్టర్ మాత్రమే. అయితే ఆమె మొదట నుంచి చివరి వరకూ ఉండటంతో ఆమె కథే అనుకుని, ఆమెను ఫాలో అవుతూంటాము. అయితే ఆమె ఏమీ చెయ్యదు. కారు డ్రైవ్ చేయటం. వీళ్ల ముగ్గురుని ఏదో ఈవెంట్ మేనేజర్ లాగో,  టీమ్ లీడర్ లాగ ..గేమ్స్ ఆడుకోండి..భోజనం చెయ్యండి... అని చెప్పటమే సరిపోతుంది. కాబట్టి జ్యోతిక వైపు నుంచి ఈ సినిమా చూస్తే జీరో. అలాగే సినిమా అంతా చూసాక...ఈ జనరేషన్ లో ఇంకా ఇలాంటి ఇల్లే కైలాసం అనుకుని,భర్త తిడితే, కొడితే పడే ఆడవాళ్లు ఉన్నారా అనే సందేహం కూడా వస్తుంది. అసలు లేకుండా పోరు కానీ మేజర్ గా ఉండే అవకాసం తక్కువ.


 టెక్నికల్ గా...
ఈ సినిమాలో డైలాగులు బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. గిబ్రాన్ సంగీతం బాగుంది. భానుప్రియ, ఊర్వశి, శరణ్య, జ్యోతిక నటన యధావిధిగా బాగుంది. మరి ఎక్కడ ఇబ్బంది వచ్చింది అంటే ఇది తొంభైల నాటి సినిమాలా చాలా చోట్ల అనిపించటమే. అలాగే స్క్రిప్టు చాలా ప్లాట్ గా ఉండటమే. గెస్ట్ గా కనిపించిన మాధవన్ ..ఏ ఇంపాక్ట్ కలగచేయకపోవటమే. 
 
ఫైనల్ థాట్...
ఇది డబ్బింగ్ సినిమా అని క్లియర్ గా అర్దమయ్యేలా టైటిల్ పెట్టడం మాత్రం అతి గొప్ప విషయం.
 Rating:2.5  

--సూర్య ప్రకాష్ జోశ్యుల
 
ఎవరెవరు..
ప్రొడక్షన్: కంపెనీ 2డి ఎంటర్టైన్మెంట్
నటీనటులు:  జ్యోతిక, ఊర్వశి, భానుప్రియ, శరణ్య పొన్నన్‌, మాధవన్  తదితరులు
సంగీతం : గిబ్రాన్
సినిమాటోగ్రఫీ:  ఎస్ మణికందన్
ఎడిటర్:  సి ఎస్ ప్రేమ్
రన్నింగ్ టైమ్: 140 నిముషాలు
రచన,దర్శకత్వం:   బ్రమ్మ 
నిర్మాత:  సూర్య 
విడుదల తేదీ:  11,సెప్టెంబర్ 2020
ఓటీటీ : ఆహా

click me!