KGF2-Beast: బీస్ట్ 10 కెజిఎఫ్ 110... ఆర్ ఆర్ ఆర్ రికార్డు కూడా లేపేసేలా ఉన్న యష్ 

Published : Apr 08, 2022, 01:01 PM IST
KGF2-Beast: బీస్ట్ 10 కెజిఎఫ్ 110... ఆర్ ఆర్ ఆర్ రికార్డు కూడా లేపేసేలా ఉన్న యష్ 

సారాంశం

కెజిఎఫ్ 2 విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తుంది. ప్రీరిలీజ్ బిజినెస్ లో విజయ్ బీస్ట్ ఎక్కడికో తోక్కేసిన ఈ చిత్రం ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేలా కనబడుతుంది.   

కె జి ఎఫ్ చాప్టర్ 2(KGF Chapter 2) చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో ఆ మూవీ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది. మాతృక కన్నడకు సమానంగా తెలుగులో కెజిఎఫ్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఓ పరభాషా చిత్రానికి ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించనిదే. గతంలో ఏ సౌత్ మూవీ తెలుగులో ఈ స్థాయిలో మార్కెట్ జరపలేదు. కన్నడలో కెజిఎఫ్ 2 రూ. 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపినట్లు సమాచారం. ఇక తెలుగులో యష్ దుమ్మురేపాడు. కె జి ఎఫ్1 భారీ విజయం నేపథ్యంలో సినిమాపై అంచనాలు అదే స్థాయిలో నెలకొన్నాయి. దీనితో రికార్డు ధరలకు కెజిఎఫ్ హక్కులు దక్కించుకున్నారు. 

నైజాం లో కెజిఎఫ్ 2 రూ. 50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కెజిఎఫ్ 2దే హైయెస్ట్ కావడం విశేషం. ఓ డబ్బింగ్ చిత్రానికి యాభై కోట్లు అంటే మాటలు కాదు. రజినీకాంత్ లాంటి హీరో సినిమాలు ఇంత మొత్తంలో అమ్ముడుపోలేదు. అలాగే ఏపీలో మరో రూ. 60 కోట్లకు ఈ చిత్ర హక్కులు విక్రయించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ 2 రూ. 110 కోట్ల బిజినెస్ చేసింది. 

హిందీ ప్రేక్షకులు సైతం కెజిఎఫ్ 2 కోసం ఎగబడుతున్నారు. కెజిఎఫ్ 2 బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఓపెనింగ్ డే రోజే రూ. 40 కోట్ల వరకు కెజిఎఫ్ 2 రాబట్టవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఆర్ ఆర్ ఆర్ హిందీ నార్త్ ఇండియాలో మొదటిరోజు కేవలం రూ. 19 కోట్ల వసూళ్లు అందుకుంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) హిందీ వసూళ్ల రికార్డు ఈ మూవీ బ్రేక్ చేయడం ఖాయమని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కెజిఎఫ్ 2 రూ. 500 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. 

కాగా కెజిఎఫ్ 2కి పోటీగా విజయ్ (Vijay) బీస్ట్ మూవీ బరిలో దిగుతుంది. ఈ రెండు చిత్రాలు ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యత్యాసం చూస్తే షాక్ కావలసిందే. విజయ్ బీస్ట్ (Beast) ఏపీ/తెలంగాణలో కలిపి రూ. 10 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే కెజిఎఫ్ 2 బిజినెస్ తో పోల్చుకుంటే.. పది రెట్లు తక్కువన్నమాట. తమిళనాడులో కూడా కెజిఎఫ్ 2 రికార్డు స్థాయిలో విడుదలవుతుండగా ఫైట్ ఆసక్తికరంగా మారింది. యష్(Yash) హీరోగా  దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఏప్రిల్ 14న విడుదలవుతుంది. కాగా బీస్ట్ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?