
టాలీవుడ్ తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. యువ నటుడు హరికాంత్ (33) నేడు హఠాత్తుగా మరణించారు. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న హరికాంత్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. అవకాశం ఉన్న ప్రతి చిత్రంలో చిన్న పాత్ర అయినా చేస్తున్నాడు.
సినీ రంగంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పెరుగుతున్న క్రమంలో హరికాంత్ కి విధిరాత కబళించింది. తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్ళింది. హరికాంత్ కి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం హరికాంత్.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 'కీడా కోలా' అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
విచిత్రం ఏంటంటే రెండురోజుల క్రితమే ఈ చిత్ర టీజర్ విడుదలయింది. టీజర్ లో హరికాంత్ తుపాకీ పట్టుకున్న షాట్ లో మెరిశాడు. 33 ఏళ్ల వయసులోనే హరికాంత్ మరణించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. సినీ అభిమానులు, ప్రముఖులు హరికాంత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. భవిష్యత్తులో మంచి మంచి చిత్రాలు చేయాలని కలలు కన్న హరికాంత్ జీవితం ఇలా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు.
హరికాంత్ మృతిపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. అతడి మృతి పట్ల తరుణ్ భాస్కర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త వినగానే నా హార్ట్ బ్రేక్ అయింది. హరి చాలా ఫ్యాషన్ కలిగిన నటుడు. గత మూడేళ్ళ నుంచి థియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇంతలోనే ఇలా జరిగింది. కీడాకోలా కోసం ఆడిషన్ చేసినప్పుడు అతడు ఫస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వగానే ఓకే చేశా.
ఈ చిత్రంలో క్లైమాక్స్ కి అతడి నటన ప్రాణం పోసింది. నిన్ననే హరికాంత్ తమ కీడా కోలా టీమ్ ని సంప్రదించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎలా జరుగుతోందో తెలుసుకున్నాడు. జీవితాన్ని ఎప్పటికి ఊహించలేం అంటూ తరుణ్ భాస్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.