నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్‌ హైకోర్ట్‌, ఆస్తుల వివరాలు సమర్పించాలంటూ..

Published : Aug 28, 2022, 05:13 PM IST
నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్‌ హైకోర్ట్‌, ఆస్తుల వివరాలు సమర్పించాలంటూ..

సారాంశం

తమిళ స్టార్ హీరో విశాల్ కు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్ట్. తన ఆస్తులు వివరాలు సమర్పించాలంటూ హుకూం జారీ చేసింది. ఇంతకీ విశాల్ ఆస్తుల వరకూ విషయం ఎలా వచ్చింది..? అసలేం జరిగింది...? 


తమిళ స్టార్ హీరో విశాల్ కు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్ట్. తన ఆస్తులు వివరాలు సమర్పించాలంటూ హుకూం జారీ చేసింది. ఇంతకీ విశాల్ ఆస్తుల వరకూ విషయం ఎలా వచ్చింది..? అసలేం జరిగింది...? 

కోలీవుడ్ స్టార్ హీరో  విశాల్‌ కు మద్రాస్ హైకోర్డ్ షాక్ ఇచ్చింది.  తన ఆస్తుల వివరాలను  సమర్పించాలని ఆదేశించింది. వివరాలు చూస్తే.. హీరోగానే కాకుండా... నిర్మాతగా కూడా విశాల్ సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా ఆయన చాలా సినిమాలు నిర్మించాడు. తన సినిమాలు చాలా వరకూ తానే నిర్మిచుకుంటున్నాడు విశాల్. ఇక  విశాల్ ఈ మధ్య ఓ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నాడు. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న విశాల్‌ ఫైనాన్షియర్‌ అన్బుచెలియన్‌కు చెందిన గోపురం ఫిలిమ్స్‌ సంస్థ నుంచి 21.29 కోట్లు రుణం తీసుకున్నాడు. 

అయితే ఈ డబ్బులు మొత్తం  లైకా ప్రొడక్షన్స్‌ చెల్లించే విధంగా విశాల్‌ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో లైకా సంస్థ తిరిగి చెల్లించే వరకు విశాల్‌కు చెందిన అన్ని  సినిమాల  హక్కులను తమ సంస్థకు రాసిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే విశాల్‌ ఆ సంస్థకు అప్పు చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్‌ హైకోర్టులో విశాల్ కు  వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేసింది. 

అందులో విశాల్‌ తమ దగ్గర అప్పగా తీసుకున్న  21.29 కోట్లు చెల్లించకుండా .. రూల్స్ ను బ్రేక్ చేసి.. తన సినిమాను వేరే  సంస్థలకు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ విధంగా వారు  ఒప్పందాన్ని అతిక్రమించారని అందుకే..ఆ చిత్ర తమిళ శాటిలైట్, ఇతర భాషల శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తీర్పును వెలువరించింది. హీరో విశాల్‌కు  15 కోట్లను ఏదైనా జాతీయ బ్యాంకు మేనేజర్ దగ్గర డిపాజిట్‌ చేయాలని  గతంలో ఉత్తర్వులు ఇచ్చింది.  కాని విశాల్ ఆ పని చేయలేదు. 

అయితే  ఈ కేసుపై శుక్రవారం మరోసారి విచారణ జరిపించింది కోర్టు. ఈ విచారణకు హీరో విశాల్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించినట్లుగా డబ్బులు బ్యాంకులో డిపాజిట్‌ చేయకపోవడానికి కారణం ఏమిటని విశాల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విశాల్‌ బదులిస్తూ తాను ఒకే రోజున 18 కోట్లు నష్టపోయానని దీంతో దానికి వడ్డీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. దీంతో కేసు ముగుస్తుందని అనుకుంటున్నారా అని విశాల్ ను కోర్ట్ ప్రశ్నించింది. అంతే కాదు విశాల్‌ తన ఆస్తుల వివరాలను న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశించింది. ఇక నెక్ట్స్ విచారణం వచ్చేనెల  9కి  వాయిదా వేసింది. అంతే కాదు నెక్ట్స్ జరగబోయే విచారణకు విశాల్ తప్పకుండా హాజర్ కావాలని ఆదేశించింది కోర్ట్ . 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?