తల్లైన విశ్వరూపం హీరోయిన్!

By team telugu  |  First Published Jan 1, 2021, 6:58 PM IST

విశాల్ జోషి భార్య పూజా కుమార్, కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పూజా కుమార్ తల్లిగా మారిన విషయం బయటికి వచ్చింది.


హీరోయిన్ పూజా కుమార్ తల్లైన విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజా కుమార్ అమ్మాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూజా కుమార్ భర్త విశాల్ జోషి తెలియజేశారు. విశాల్ జోషి భార్య పూజా కుమార్, కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పూజా కుమార్ తల్లిగా మారిన విషయం బయటికి వచ్చింది. 

మిస్ ఇండియా యూఎస్ టైటిల్ అందుకున్న పూజా కుమార్ 2000లో విడుదలైన కాదల్ రోజావే అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అమెరికాలో పుట్టిపెరిగిన పూజా కుమార్ కొన్ని ఆంగ్ల చిత్రాలలో కూడా నటించడం జరిగింది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విశ్వరూపం మూవీలో పూజా కుమార్ నటించారు. దానికి కొనసాగింపుగా వచ్చిన విశ్వరూపం 2లో కూడా పూజ కుమార్ నటించడం జరిగింది. 

Latest Videos

కమల్ కుటుంబంతో చాలా సన్నితంగా ఉంటున్న పూజా కుమార్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. కమల్, పూజా కుమార్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడం జరిగింది. కొన్నాళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన విశాల్ జోషిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది.  
 

. married! Now, a proud mom!

Her husband has posted the happy news on his Instagram page

BREAKING: https://t.co/AFcwPVsPN8 pic.twitter.com/QrrMwYOk3W

— sridevi sreedhar (@sridevisreedhar)
click me!