
ప్రస్తుతం బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా రీమేక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం అనే భాషాబేధం లేకుండా సినిమా హిట్ అయ్యి, యూనివర్సల్ కాన్సెప్ట్ అనిపిస్తే చాలు బడా హీరోలు రీమేక్ కే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి అదే బాటలో నడుస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన రాబోయే చిత్రాన్ని తమిళ రీమేక్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘సూరరై పొట్రు’ (Soorarai Pottru) తమిళం చిత్రం ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీ.ఆర్. గోపీనాథ్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు డైరెక్టర్ సుధా కొంగర. రియల్ లైఫ్ స్టోరీ కావడం, సూర్య అద్భుత నటనతో సౌత్ లో మంచి రెస్సాన్స్ లభించింది. ఈ చిత్రంలో తెలుగులో ‘ఆకాశమే హద్దురా’ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి ఇక్కడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్, రాధిక మదన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళ దర్శకుడు సుధా కొంగరనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈ రీమేక్‌ను విక్రమ్ మల్హోత్రాకు చెందిన అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు 2D ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ ముహూర్తపు షాట్ ను ప్రారంభించారు. ఆ వీడియోను రాధిక మదన్ (Radhika Madan), అక్షయ్ కుమార్ వారి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. సినిమా ప్రారంభం కావడంతో నార్త్ ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్సైట్ గా ఫీలవుతున్నారు.
సూర్య సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘సూరరై పొట్రు’ హిందీ రీమేక్ షూటింగ్ ప్రారంభం అయినా.. ఇంకా టైటిల్ మాత్రం ఖరారు చేయలేదు. పలు టైటిట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడానికి చాలా ముందు, ఆరు నెలలుగా ఈ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు. గతేడాది రీమేక్ ను ప్రకటించారు.