
తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri)రిలేషన్ రూమర్స్, బాడీ షేమింగ్ వంటి అనేక విషయాలపై మాట్లాడారు. జనాలు ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకుంటారు. అందుకే అవేమి నేను పట్టించుకోను. వాళ్ళను అలా ఊహించుకొని ఎంజాయ్ చేయని అనుకుంటాను అన్నారు. నర్గీస్ ఫక్రీ ఓ బిజినెస్ మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితంలో అందరూ డేటింగ్ చేస్తారు. కానీ నేను సెలబ్రిటీ కావడం వలన దానిని ప్రత్యేకంగా చూస్తారు. నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారని.. ఆమె తెలిపారు.
ఇండియాకు వచ్చిన కొత్తలో నేను చాల సన్నగా ఉండేదాన్ని. అప్పుడు మీరు బరువు పెరగాలని చాలా మంది సలహాలిచ్చారు. దానితో నేను కొంచెం బరువు పెరిగాను. కొంచెం లావు కాగానే నన్ను బాడీ షేమింగ్ చేశారు. నేను గర్భవతిని అంటూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ నన్నెంతో బాధపెట్టాయి. తర్వాత నేను రియలైజ్ అయ్యాను. నా ఆరోగ్యం కోసం బరువు తగ్గాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
2011లో విడుదలైన రాక్ స్టార్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోడల్ నర్గీస్ ఫక్రీ. ఆ సినిమాలో హీరో రన్బీర్ కపూర్ తో ఆమె కురిపించిన రొమాన్స్ కి బాగా మార్కులు పడ్డాయి. దీనితో ఐఫా హాటెస్ట్ ఫెయిర్ అవార్డు గెలుపొందింది. నర్గీస్ ఎంట్రీ ఘనంగా జరిగినా.... కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగలేదు. దీనితో 2016లో బ్రేక్ తీసుకుంది. 2018లో మరలా 5 వెడ్డింగ్స్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరి హర వీరమల్లు(Hari hara veeramallu) మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.