Varun Tej: గని డిజాస్టర్ రిజల్ట్... అక్కడే తేడా కొట్టిందంటున్న వరుణ్... సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్!

Published : Apr 12, 2022, 04:16 PM IST
Varun Tej: గని డిజాస్టర్ రిజల్ట్... అక్కడే తేడా కొట్టిందంటున్న వరుణ్... సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్!

సారాంశం

మెగా హీరో వరుణ్ తేజ్ కి గని ఊహించని షాక్ ఇచ్చింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. గని అనూహ్య పరాజయం నేపథ్యంలో వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.   

వరుణ్ (Varun Tej) కెరీర్ కి గని పెద్ద దెబ్బేసింది. వరుస విజయాలతో జోరుమీదున్న ఒక్కసారిగా చతికిలబడ్డారు. ప్రీరిలీజ్ బిజినెస్ లో నాలుగో వంతు కూడా రాబట్టలేకపోయిన గని 2022 డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది. మొదటి షో నుండే గని మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కొత్తదనం లేని కథ, కథనం. ఎమోషన్స్, లవ్ స్టోరీ ఆకట్టుకోకపోవడంతో గని ప్రేక్షకులకు ప్రత్యక్ష నరకం చూపించింది. వరుణ్ ఏడాది కష్టానికి కనీస ఫలితం లేకుండా పోయింది. రెండో రోజే గని థియేటర్స్ నుండి తొలగించారంటే ఏ స్థాయిలో వైఫల్యం చెందిందో అర్థం చేసుకోవచ్చు. 

కాగా ఓటమిని గౌరవంగా అంగీకరిస్తూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ కి తన సందేశం విడుదల చేశాడు వరుణ్. ''ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. గని మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నిర్మాతలకు ధన్యవాదాలు. అందరూ మనస్ఫూర్తిగా గని చిత్రం కోసం పనిచేశారు. 

ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఎంతోకష్టపడి ఇష్టంతో గని చిత్రాన్ని రూపొందించాము. అయితే మా ఆలోచనలు స్క్రీన్ పై చెప్పడంలో లోపం జరిగి ఉండవచ్చు. నేను ప్రతి చిత్రానికి వీలైనంత ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కోసారి సక్సెస్ అవుతాను, కొన్నిసార్లు నేర్చుకుంటాను. ఫలితం ఏదైనా కష్టపడటం ఆపేది లేదు...'' అంటూ తన మనోభావాలు పంచుకున్నారు. 

గని(Ghani movie)రూపంలో ఓ మంచి చిత్రం ప్రేక్షకులకు అందించాలని తనతో పాటు టీమ్ కష్టపడ్డారని, అయితే తాము అనుకున్న విధంగా మూవీ రాకపోయి ఉండవచ్చు. అందుకే ప్రతికూల ఫలితం వచ్చిందని వరుణ్ తెలియజేశారు. ఫిదా మూవీ తర్వాత ఈ రేంజ్ ప్లాప్ వరుణ్ కి ఎదురు కాలేదు. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన గని చిత్రాన్ని అల్లు అర్జున్ బ్రదర్ అల్లు వెంకట్, సిద్దు ముద్ద నిర్మించారు.  అయితే ఎఫ్ 3 మూవీతో ఆయన కమ్ బ్యాక్ అయ్యే అవకాశం కలదు. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?