‘పవన్ కళ్యాణ్ ఉమనైజర్’.. ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!

By Asianet News  |  First Published Mar 11, 2023, 5:49 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు (Umair Sandhu) షాకింగ్ గా ట్వీట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా 27 ఏండ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి  చేసుకున్న ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఆయన క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మరోవైపు ప్రజా సేవ చేసేందుకు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. ప్రస్తుతం పవన్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ అత్యంత బిజీగా ఉంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ తనపని తానూ చేసుకుంటూ పోతూ ఉన్న కొంతమంది ఆయనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.  

ఇప్పటికే మూడు పెళ్లిళ్ల విషయంపై చాలా సందర్భాల్లో పలువురు  విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ‘అన్ స్టాపబుల్ 2’ వేదికన మరోసారి పవర్ స్టార్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు. ఇక తాజాగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ మరియు సౌత్ ఏషియా ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు (Umair Sandhu) పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పవర్ స్టార్ ను ‘డై హార్డ్ ఉమనైజర్’ అంటూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

Latest Videos

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తావిస్తూ.. అలాగే హీరోయిన్లతోనూ పవన్ కళ్యాణ్ అలా.. అంటూ  ఉమైర్ సంధు షాకింగ్ గా ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉమైర్ సంధు ట్వీట్ పై మండిపడుతున్నారు. తమ అభిమాన హీరోపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానించడం ఏమాత్రం బాగోలేదని ఫైర్ అవుతున్నారు. ఘాటు కామెంట్లతో ఉమైర్ తీరును తప్పుబడుతున్నారు.   

గతంలోనూ ఉమైర్ సంధు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి విషయంలో రూమర్లు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ యాక్ట్రెస్ క్రితిసనన్ తో ప్రభాస్ పెళ్లి అంటూ లేనిపోని పుకార్లతో రచ్చ చేయడం విధితమే. ఇక రీసెంట్ గా మహేశ్ బాబ్ పైనా షాకింగ్ గా ట్వీట్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై ఇలా స్పందించడంతో ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. పుకార్లు లేపే చర్యలను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’,‘వినోదయ సీతమ్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు పొలిటికల్ కార్యక్రమాల్లోనూ క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ప్రస్తుతం మంగళగిరి  పార్టీ కార్యాలయంలోని బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్ పోర్టులో పవన్ మిలిటరీ ప్యాంట్ బ్లాక్ టీషర్ట్ లో స్టైలిష్ లుక్ గా ఆకట్టుకున్నారు. ఆ పిక్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

is Die~Hard Womanizer. He divorced 2 times & still he caught with many Leading Actresses doing Hangout !! He slept with alot of Top actresses. pic.twitter.com/34uf45Y3Pi

— Umair Sandhu (@UmairSandu)

 

click me!