సర్ ప్రైజ్ వీడియో రిలీజ్ చేసిన ఎఫ్ 3 టీమ్, రిలీజ్ కు ముస్తాబవుతున్న సినిమా

Published : Apr 26, 2022, 08:30 PM IST
సర్ ప్రైజ్ వీడియో రిలీజ్ చేసిన ఎఫ్ 3 టీమ్, రిలీజ్ కు ముస్తాబవుతున్న సినిమా

సారాంశం

ఈ సార్ మోర్ ఫన్ అంటున్నారు ఎఫ్3 మూవీ టీమ్. అందుకు తగ్గట్టే అప్పుడప్పుడు సర్ ప్రైజ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే   ఇలాంటి వీడియోస్ చాలా రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా మరో మేకింగ్ వీడియోతో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్. 

ఈ సార్ మోర్ ఫన్ అంటున్నారు ఎఫ్3 మూవీ టీమ్. అందుకు తగ్గట్టే అప్పుడప్పుడు సర్ ప్రైజ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే   ఇలాంటి వీడియోస్ చాలా రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా మరో మేకింగ్ వీడియోతో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్. 
 
విక్టరీ స్టార్ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఎఫ్ 3. యఈమూవీని దిల్ రాజు నిర్మింస్తున్నారు. ఈ సినిమాకి  రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మూవీ టీమ్. రిలీజ్ కు చాలా టైమ్ ఉన్నా.. ముందు నుంచే కొన్ని వీడియోలతో సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు టీమ్. 

ఇందులో భాగంగా రీసెంట్ గా ఊ ఆ అహ అహ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ వీడియో  లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పానస్ వస్తోంది.  దాంతో ఈ పాటకు సంబంధించిన తాజా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు టీమ్. వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్,  తమన్నా,  మెహ్రీన్, సోనాల్ చౌహాన్ కలిసి యాక్ట్ చేసిన ఈ పాటకు శేఖర్ మాస్టర్  కొరియోగ్రాఫీ అందించాడు. 

 

ఇక ఈ పాట  షూటింగు కు సంబంధించిన వీశేషాలతో కూడిన  వీడియోను రిలీజ్ చేశారు టీమ్. ఇక ఈ పాటతో పాటు ఈ సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. భార్యల కోరికలు తీర్చలేక భర్తలుపడే అవస్థల చుట్టూ తిరిగే కథతో ఈసినిమా తెరకెక్కుతోంది.  

అనిల్ రావిపూడి  సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. కామెడీ కథలను హ్యాండిల్ చేయడంతో అనిల్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఈ జానర్ లో అనిల్ రావిపూడి సక్సెస్ సాధించాడు. రాజేంద్రప్రసాద్,సునీల్,మురళీశర్మ,సంగీత, అంజలి లాంటి స్టార్స్ నటిస్తున్న ఈమూవీ  మే 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?