ఫస్ట్ వీకెండ్ పూర్తి.. ‘సార్’ ఎంత కలెక్ట్ చేశారు? చిత్రంపై ప్రముఖ దర్శకుడి కామెంట్స్

By Asianet News  |  First Published Feb 20, 2023, 1:04 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సార్’. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
 


తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సార్’. తమిళంలో ‘వాతీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా  ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ ను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించారు. థియేట్రికల్ గా ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా SiR చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతోంది. 

ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్ర కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

Latest Videos

నైజాంలో - రూ. 6.7 కోట్లు
సీడెడ్ లో-  రూ. 2.25 కోట్లు
యూఏ - రూ. 2.15 కోట్లు
తూర్పు – రూ. 1.5 కోట్లు
వెస్ట్ - రూ. 0.67 కోట్లు
గుంటూరు - రూ. 1.35 కోట్లు
కృష్ణ - రూ. ఒక కోటీ
నెల్లూరు - రూ. 0.6 కోట్లు
మొత్తం -ఏపీ / తెలంగాణ వసూల్ కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక యూఎస్ ఏలోనూ మొదటి రోజు 10కే డాలర్లు వసూల్ చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసిఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి వసూళ్లను రాబుతుండటం విశేషం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేసిందని, తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.18 కోట్లుగా ఉందని సమాచారం. ఇక సినిమా టాక్ అదిరిపోవడంతో సినిమా మరింతగా వసూల్ చేసే అవకాశం ఉందంటున్నారు. 

ఇదిలా ఉంటే..  ఈ చిత్రంపై తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా ఆసక్తికరంగా స్పందించారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా, విద్యను ప్రోత్సహించడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణించారు. "నా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో  'సర్' ఒకటి. నేను చాలా సినిమాలు చూస్తున్నాను, నేను ఇందులో భాగమైనందున ఇది ప్రత్యేకమైనది. సినిమాలు వినోదం పంచడం కంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో వాతి ఒకటి. వాతిలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు" అని భారతీరాజా ప్రకటనలో తెలిపారు.

ధనుష్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స, జివి ప్రకాష్ ఘనమైన బిజిఎమ్ ప్రేక్షకులను ఆకర్షించడంలో సినిమాకు బాగా సహాయపడిందని అన్నారు.  ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.  చిత్రం ఓటీటీ, డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్,  జెమిని సంస్థలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

click me!