‘జైలర్’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఐశ్వర్య రజినీకాంత్.. తమిళ స్టార్ ధనుష్.. ఇంకెవరెవరంటే?

By Asianet News  |  First Published Aug 10, 2023, 3:26 PM IST

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ - తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘జైలర్’. ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షోకు ధనుష్, ఐశ్వర్య తో పాటు పలువురు వెళ్లడం విశేషం. 
 


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ ఫిల్మ్ Jailer. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీకాంత్ అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. 

ఇప్పటికే చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఏకంగా ఉద్యోగులకు సెలవు ప్రకటించి... సినిమా టికెట్లను కూడా ఐదు కంపెనీలు ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇటు అభిమానులతో అటు స్టార్స్ కూడా ‘జైలర్’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు థియేటర్లకు వెళ్లారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)  కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ‘జైలర్’ చూశారు. తాను రజనీకాంత్‌కి వీరాభిమానిని అని ధనుష్ ఎప్పటినుంచో నిలబెట్టుకున్నాడు. 

Latest Videos

ధనుష్ రజనీకాంత్ వీరాభిమాని కావడంతో విడుదలైన మొదటి రోజునే చెన్నైలోని ఓ థియేటర్ లో జైలర్‌ చిత్రాన్ని చూశారు. ఇందుకు సంబంధించిన  ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ కూడా ఈ సినిమాను మొదటిరోజునే చూడటం విశేషం. రజనీకాంత్ భార్య లత రజనీకాంత్ కూడా చిత్రాన్ని వీక్షించారు. ఇక నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సైతం మొదటిరోజునే సినిమా చూసి రజినీపై అభిమానాన్ని చాటుకున్నారు. 

ఇక ఐశ్వర్య రజనీకాంత్‌ - ధనుష్ వివాహం చేసుకున్న 18 సంవత్సరాలకు విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మళ్లీ కలవాలని అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇలా మొదటి రోజు ‘జైలర్’ మూవీని వారిద్దరు విడివిడిగా చూడటం విశేషం. ఇదిలా ఉంటే.. జైలర్ టాక్ అదిరిపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నారు. 

 

click me!