
‘శ్యామ్ సింగరాయ్’తో ఫ్యాన్స్ ను అలరించిన నేచురల్ ష్టార్ నాని (Nani) తర్వాత ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలవుతోంది. ఫిబ్రవరిలోనే చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్న Ante Sundaraniki చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలో అభిమానులను ఖుషీ చేసేందుకు క్రేజీ అప్డేట్స్ కూడా అందిస్తున్నారు.
తాజాగా ‘అంటే సుందరానికీ’ నుంచి అదిరిపోయే అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్స్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ రిలీజ్ అవగా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ రొమాంటిక్ డ్రామా టీజర్ (Ante Sundaraniki Teaser) రిలీజ్ పై అనౌన్స్ మెంట్ చేశారు. ఏప్రిల్ 20న ఉదయం 11:07 సమయానికి టీజర్ విడుదల కానుందని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని నాని తన అభిమానులకు ఇన్ స్టాలో తెలియజేశారు. ఫ్యాన్స్ కు ఈ సినిమా ద్వారా వందశాతం ఫన్ అందిస్తామని ప్రామీస్ చేశాడు. దీంతో అభిమానులు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే పోస్టర్స్ వదిలారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి నాని, నజ్రియా ఫహద్ (Nazriya Fahad) కలిసి ఉన్న రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్స్ బయటికి వదలలేదు మేకర్స్. మరోవైపు ఫస్ట్ గ్లింప్స్ లోనూ వీరద్దరూ ఎక్కడా కలిసినట్టుగా లేకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పంచె కట్టులో నాని, పట్టు చీరలో నజ్రియా ఆకట్టకుంటున్నారు.
అంటే సుందరానికీలో.. నాని సుందర ప్రసాద్ అనే పాత్ర పోషిస్తున్నాడు. నాని సరసన హీరోయిన్ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) ఆడిపాడనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాని దసరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.