Megastar Wishes to Bunny:అల్లు అర్జున్ కు మెగాస్టార్ చిరంజీవి క్రేజీ బర్త్ డే విషెష్

Published : Apr 08, 2022, 01:16 PM IST
Megastar Wishes to Bunny:అల్లు అర్జున్ కు  మెగాస్టార్ చిరంజీవి క్రేజీ బర్త్ డే విషెష్

సారాంశం

40వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంకా కుర్రాడిలా మెరిసిపోతున్నా హ్యాండ్సమ్ స్టార్ పుట్టన రోజు నేడు(8 ఏప్రిల్). ఈ సందర్భంగా స్టార్స్ బన్నీని వరుసగా విష్ చేస్తున్నారు.  

40వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంకా కుర్రాడిలా మెరిసిపోతున్నా హ్యాండ్సమ్ స్టార్ పుట్టన రోజు నేడు(8 ఏప్రిల్). ఈ సందర్భంగా స్టార్స్ బన్నీని వరుసగా విష్ చేస్తున్నారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఈరోజు (ఏప్రిల్ 8) శుక్రవారం 40వ పుట్టిన రోజుపే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బన్నీ బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో  విషెష్  వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ సెలబ్రెటీలు అల్లు అర్జున్ కు  స్పెషల్‌ గా విషెస్‌ తెలుపుతున్నారు. ఈ క్రమంలో  మెగా ఫ్యామీలీ నుంచి కూడా అల్లు అర్జున్ కు స్పెషల్ గా శుభాకాంక్షలు అందాయి. 

మరీ ముఖ్యంగా టాలీవుడ్ మెగాస్టార్.. బన్నీ మామ  మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు బన్నీ. వర్క్‌ పట్ల నువ్వు చూపించే పట్టుదల, అంకితభావం.. కష్టపడేతత్త్వమే నిన్ను స్టార్‌ హీరోగా నిలబెట్టాయి. ఈ పుట్టిన రోజును ల్యాండ్‌మార్క్‌ బర్త్‌డేగా మార్చుకో  అంటూ చిరు క్రేజీగా విషెస్‌ తెలిపారు.

 

 

చిరంజీవి  ట్వీట్‌ను బన్నీ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు ఆయన ట్వీట్‌ను ర్వీట్వీట్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు. ఇక  ఈ ట్వీట్‌కు చాలా తక్కువ టైమ్ లోనే దాదాపు  23వేలకు పైగా లైక్స్‌, 4 వేలకు పైగా రీట్వీట్స్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో దిల్ కుష్ అవుతున్నారు. 

అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమాతో బన్నీ హీరోగా పరిచయయ్యాడు. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ సూపర్‌ హిట్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి స్టైలిష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్.. పుష్ప పార్ట్ 2 షూటింగ్ ను త్వరలో స్టార్ట్ కాబోతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?