Lal Singh Chadda: లాల్ సింగ్ చడ్డా... చైతూ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన చిరు! 

By Sambi Reddy  |  First Published Jul 20, 2022, 7:36 PM IST

మెగాస్టార్ చిరంజీవి లాల్ సింగ్ చడ్డా చిత్రం నుండి అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన ప్రెజెంట్ చేస్తుండగా ప్రమోషన్స్ లో ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు.
 



బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా(Lal Singh Chadda). హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న లాల్ సింగ్ చడ్డా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో లాల్ సింగ్ చడ్డా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి(Chiranjeevi) లాల్ సింగ్ చడ్డాను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. 

ఇటీవల చిరంజీవి నివాసంలో లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. అమీర్ ఖాన్ తో పాటు పరిశ్రమ ప్రముఖులైన నాగార్జున, సుకుమార్, నాగ చైతన్య, రాజమౌళి పాల్గొన్నారు. కాగా నేడు లాల్ సింగ్ చడ్డా నుండి నాగ చైతన్య లుక్ రివీల్ చేశారు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా చైతూ లుక్ లాంఛ్ చేశారు. ''లాల్ సింగ్ చడ్డా చడ్డీ బడ్డీ బాలరాజును మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి బాలరాజు మనవడు అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు...'' అంటూ ట్వీట్ చేశారు. 

‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను.

అలనాటి ‘బాలరాజు’ మనవడు మన
అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు.

Introducing
from pic.twitter.com/1cVgbURrZx

— Chiranjeevi Konidela (@KChiruTweets)

Latest Videos

ఇక ఆర్మీ గెటప్ లో నాగ చైతన్య(Naga Chaitanya) లుక్ ఆసక్తి రేపుతోంది. లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య కీలక రోల్ చేస్తున్నారు. ఆయన ఆర్మీ క్యాంపులో అమీర్ ఖాన్(Amir Khan)మిత్రుడిగా కనిపించనున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వియాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా లాల్ సింగ్ చడ్డా చిత్రం నిర్మిస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎమోషనల్  డ్రామాగా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా ప్రోమోలు ఆకట్టుకున్నాయి. 

click me!