70 ఏళ్ల వయస్సులో కూడా గ్రేస్ తగ్గని మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తూనే.. తనకు ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆయనకు అత్యంత ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?
చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్.. తెలుగు పరిశ్రమకు పెద్దన్న.. ఇండస్ట్రీలో మెగా సాంమ్రాజ్యాన్ని నిలబెట్టిన స్టార్ హీరో. ఆయన అభిరుచులు ఎలా ఉంటాయి. ఇష్టంగా ఏం తింటారో తెలుసా..?
ఏడు పదుల వయస్సుకు అడుగు దూరంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయినా సరే అదే ఫిట్ నెస్ తో.. కుర్రహీరోలను మించిన హుషారుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నటన కాని.. డాన్స్ కాని ఏవిషయంలోను తగ్గడంలేదు చిరంజీవి. అయితే మెగాస్టార్ గురించి అందరికి తెలిసిందే. కాని ఆయన పర్సనల్ విషయాలు ఎంత మందికి తెలుసు.మరీముఖ్యంగా ఆయనకు ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసా..?
చిరంజీవి మంచి భోజన ప్రియుడు. కాని అతిగా కాకుండా ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా.. మితంగా తింటుంటారు. అందులో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ కు సంబంధించిన ఓన్యూస్ వైరల్ అవుతోంది. ఓ సందర్భంలో సినిమా ఫంక్షన్ లో.. అందరిముందు యాంకర్ సుమ ఈ ప్రశ్నను మెగాస్టార్ చిరంజీవిని అడిగింది. అయితే ఈ ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి వచ్చింది కావడంతో చిరంజీవి సమాధానం చెప్పారు.,
రాజమౌళి అనే మెగా ఫ్యాన్స్ ఈ ప్రశ్నను పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఇలా కొన్ని ప్రశ్నలు సేకరించి.. సినిమా ఫంక్షన్ లో అడిగారు. అందులో భాగంగా సుమ అడుగుతూ.. నాటు కోడి , చేపల పులుసు ఈ రెండింటిలో బాగా ఇష్టంగా తినేది ఏంటి అని మెగాస్టార్ ను అడిగారు సుమ. దాంతో చిరంజీవి నోరు ఊరిపోతుంది అంటూ..ఈరెండు వదలకుండా తింటాను అన్నారు.
అయితే రెండింటిలో ఒకటి మాత్రమే ఆప్షన్ గా తీసుకోవాలి అంటే మాత్రం ఎప్పటికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని సమాధానం చెప్పారు చిరంజీవి. అందులోను మెగాస్టార్ కు.. ఆయన మాతృమూర్తి అంజనాదేవి చేతులు మీదుగా చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టమంట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. అంతే కాదు తన చేతులు మీదుగా ఓసారి చేపల వేపుడు చేసి పెట్టారు కూడా.
చింరజీవి వచ్చే సంవత్సరానికి 70 వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే సరే ఏమాత్రం తగ్గేది లేదు అంటున్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. సినిమాలు చేస్తున్నారు. డాన్స్ విషయంలో అయితే అసలు వెనకడుగు వేసేది లేదు అంటున్నారు. గతంలో ఎలాంటి మూమెంట్స్ ఇచ్చారో.. ఇప్పుడు కూడా అదే మూమెంట్స్ ఇవ్వగలరు చిరు.
ప్రతీ సినిమాకు ప్రయోగాలు చేస్తూ.. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అలరిస్తున్నారు చిరంజీవి. గెలుపు ఓటములు పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు చిరు. సైరా లాంటి సినిమాలు ఈ వయస్సులో చిరు చేయగలిగారంటే.. ఆయనకు సినమాలపై ఉన్న ప్రేమ అర్దం అవుతుంది. అంతేనా.. డాన్స్ ఒక్కటే కాదు.. యాక్షన్స్ సీక్వెన్స్ లు కూడా ఈ ఏజ్ లో అలవోకగా చేస్తూ... అభిమానులనుఅలరిస్తున్నారు చిరు.
ఇక రీసెంట్ గా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఆయనకు అందించారు ప్రతినిధులు. గిన్నిస్ బుక్ ఏజంట్ తో పాటు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా పాల్గోన్నారు. అంతే కాదు చిరంజీవికి ఈ అవార్డు ఆయనే స్వయంగా అందజేశారు. 156కి పైగా సినిమాల్లో చిరంజీవి చేసిన డాన్స్ కు.. ఆయన డాన్స్ లో చేసిన ప్రయోగాలుకు ఈ అవార్డ్ వరించింది.
భారతీయ చలనచిత్ర రంగంలో ఫ్రొలిఫిక్ ఫిలిం స్టార్‌గా గిన్నిస్ రికార్డును అందుకున్నారు చిరంజీవి. 45 ఏళ్ల సినీ కెరీర్‌లో 156 సినిమాల్లో చిరంజీవి నటించారు. ఈ సినిమాలన్నింటిలో దాదాపు 537 పాటలలో 24000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. టాలీవుడ్ లో డాన్స్ అంటే చిరు.. చిరు అంటే డాన్స్ అన్న విధంగా మార్చేశారు.
సాధారణ కానిస్టేబుల్ తనయుడిగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి. సినిమాల్లో అంచలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నాడు. చిన్న పాత్రల నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఆయన.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దన్నగా నిలిచారు. అయితే ఆయన ఒక్కడు మాత్రమే కాదు.. ఆయన ఇంటి నుంచి హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు, డాన్సర్లు, ఇలా అన్నిరకాల టాలెంట్ ఉన్నవారు ఉన్నారు.
ఇక బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలా .. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ భారీ వృక్షంలా తయారు చేసుకున్నారు చిరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. అల్లు అర్జున్ వీరు పాన్ ఇండియా స్టార్స్ గా.. టైర్ 1 హీరోలుగా వెలుగు వెలుగుతున్నారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఇలా టైర్ 2 హీరోలు కూడా ఉన్నారు. నిర్మాతలుగా నాగబాబు, రామ్ చరణ్, హీరోయిన్ గా నిర్మాతగా నిహారికా, ఇలా మెగా ప్యామిలీ నుంచి ఇండస్రీని ఏలేస్తున్నారు.