మహెష్ కి చిరంజీవి థ్యాంక్స్.. సూపర్ స్టార్ వాయిస్ తో కొత్త ప్రపంచంలోకి, టెర్రిఫిక్ అంటున్న కొరటాల

Published : Apr 22, 2022, 10:44 AM IST
మహెష్ కి చిరంజీవి థ్యాంక్స్.. సూపర్ స్టార్ వాయిస్ తో కొత్త ప్రపంచంలోకి, టెర్రిఫిక్ అంటున్న కొరటాల

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కామియో రోల్ లో నటించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. 

చిరంజీవి, రాంచరణ్ ఇద్దరూ ఈ చిత్రంలో కామ్రేడ్స్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవాలయాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆచార్య చిత్ర యూనిట్ మహేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాలో మహేష్ కి థ్యాంక్స్ చెప్పారు. 'పాదఘట్టం ని పరిచయం చేయడంలో వాయిస్ అందించిన డియరెస్ట్ మహేష్ బాబుకి థ్యాంక్స్. 

స్పెషల్ వే లో నీవు ఆచార్య చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. ఆచార్యలో నీ వాయిస్ విని నేను, రాంచరణ్ థ్రిల్ అయినట్లుగానే.. ప్రేక్షకులు కూడా అద్భుతమైన అనుభూతికి లోనవుతారు.' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఇక కొరటాల శివ మాట్లాడుతూ.. ఆచార్య చిత్రంలో మొదటి రెండు నిముషాలు చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. ధర్మస్థలిలో అమ్మవారు ఎలా వెలిశారు.. ఆ టౌన్ ఎలా ఏర్పడింది అనే కథ ఉంటుంది. దానిని వివరించి ప్రేక్షకుల్ని ఆచార్య ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. దీనికోసం నిజాయతీ కలిగిన ఒక వాయిస్ కావాలి. అందుకే సూపర్ మహేష్ బాబుని అడిగాం. అడిగిన వెంటనే ఆయన ఒకే అన్నారు. 

తన వాయిస్ తో మొదటి రెండు నిముషాలు మూడ్ సెట్ చేసిన విధానం.. క్రియేట్ చేసిన ఇంపాక్ట్ టెర్రిఫిక్ అని కొరటాల శివ అన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆచార్య రిలీజ్ కు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా