మార్గనిర్దేశకుడు.. స్ఫూర్తిదాయకుడు.. అమితాబ్‌కి చిరు, ప్రభాస్‌, మహేష్‌, చెర్రీ విశెష్‌

Published : Oct 11, 2020, 01:53 PM ISTUpdated : Oct 11, 2020, 01:59 PM IST
మార్గనిర్దేశకుడు.. స్ఫూర్తిదాయకుడు.. అమితాబ్‌కి చిరు, ప్రభాస్‌, మహేష్‌, చెర్రీ విశెష్‌

సారాంశం

పడిలేచిన కెరటం మాదిరిగా, ఎన్నో ఆటుపోట్లని అధిగమించి ఈ స్టేజ్‌కి చేరుకున్నారు. స్ఫూర్తికి, ఆదర్శానికి, నిదర్శనానికి ఆయన కేరాఫ్‌. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువెత్తుతున్నాయి.

బిగ్‌బి.. ఇండియన్‌ తెరపై మరొకరు భర్తీ చేయలేని పేరు. అది ఆయనకు మాత్రమే సూట్‌ అయ్యే పేరు.  బాలీవుడ్‌నే కాదు, ఇండియన్‌ తెరని ఐదు దశాబ్దాలుగా ఏలుతున్న పేరు. ఆయనే అమితాబ్‌ బచ్చన్‌. వీడు హీరో ఏంటీ అనే స్టేజ్‌ నుంచి తిరుగులేని సూపర్‌ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగిన అమితాబ్‌ బచ్చన్‌ నేడు(ఆదివారం)తన 78వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

పడిలేచిన కెరటం మాదిరిగా, ఎన్నో ఆటుపోట్లని అధిగమించి ఈ స్టేజ్‌కి చేరుకున్నారు. స్ఫూర్తికి, ఆదర్శానికి, నిదర్శనానికి ఆయన కేరాఫ్‌. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వంటి ప్రముఖులు బిగ్ బికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు ఆయన మార్గనిర్దేశకుడని, ఆయన తనని ఎప్పుడూ ఇన్‌స్పైర్‌ చేస్తారని చిరు, మహేష్‌, చెర్రి, ప్రభాస్‌ అన్నారు. 

బిగ్‌బాస్‌ తెలుగులో `మనం`తోపాటు చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి`లో గురువు గోసాయి వెంకన్నగా నటించారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో కీలక పాత్రకి ఎంపికయ్యారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్