2018 డ్రగ్స్  కేసులో కీలక మలుపు... పూరి, తరుణ్ ల ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఏముందంటే?

By Sambi Reddy  |  First Published Feb 1, 2024, 5:45 PM IST

డ్రగ్ కేసు కీలక మలుపు తిరిగింది. టాలీవుడ్ సెలెబ్స్ పై నమోదైన ఎనిమిది కేసుల్లో ఆరు కేసులు కొట్టేసింది. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చి చెప్పింది. 
 


2018లో డ్రగ్ డీలర్ కాల్విన్ మాస్కరెన్హాస్ అరెస్ట్ అయ్యాడు. అతన్ని విచారించిన పోలీసులు టాలీవుడ్ ప్రముఖులైన పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, ఛార్మి, నవదీప్, మొమైత్ ఖాన్, శ్యామ్ కే నాయుడు, నందు, చిన్న ఎన్ ధర్మారావు, తనీష్, సుబ్బరాజు లకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. టాప్ సెలెబ్స్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అప్పట్లో సంచలనమైంది. 

రోజుకు ఒకరు చొప్పున అధికారులు వీరిని గంటల తరబడి విచారించారు. వీరి నుండి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్స్ గా సేకరించారు. ఏళ్ల తరబడి సాగిన ఈ డ్రగ్స్ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు, ఆధారాలు లభించలేదని న్యాయస్థానం పేర్కొంది. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే తీసుకుని ఫోరెన్సిక్స్ పంపినట్లు సమాచారం. 

Latest Videos

తరుణ్, పూరి డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. వీరిపై నమోదైన ఎనిమిది కేసుల్లో 6 కేసులు న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే ఈ కేసులో ఎక్సైజ్ శాఖ వారు సరిగా విధి విధానాలు పాటించని క్రమంలో వారికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. 
 

click me!