టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అషురెడ్డి పేరు కూడా రావడంతో.. ఇప్పటికే స్పందించింది. తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యింది.
టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద డ్రగ్స్ క్రేస్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అప్పుడు టాలీవుడ్ లోని టాప్ సెలబ్రెటీలను అధికారులు విచారించారు. ఇక తాజాగా నిర్మాత కేజీ చౌదరి ద్వారా డ్రగ్స్ కేసు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇందులో పలువురు సెలబ్రెటీల పేర్లు బయటికి వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
రెండు వారాల కింద నిర్మాత కేపీ చౌదరి వద్ద సైబరాబాద్ పోలీసులు కొకైన్ గుర్తించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిరంతరంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో సినీ, టీవీ సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బిగ్ బాస్ బ్యూటీ Ashu Reddy పేరు కూడా వచ్చింది. అలాగే విచారణలో నటి జ్యోతి, సురేఖ వాణి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయని తెలిపారు. అషురెడ్డి నెంబర్ కూడా బయటికి వచ్చింది.
ఈ ఇష్యూ పై ఇప్పటికే అషురెడ్డి స్పందించారు. డ్రగ్స్ కేసు తో తనకెలాంటి సంబంధం లేదని, అలాంటి వ్యక్తులతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తనపేరు బయటకి రావడాన్ని ఖండించారు. పలు సంస్థలు తన ఫోన్ నెంబర్ బహిర్గతం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. ఇక తాజాగా స్పందిస్తూ.. తన ఫోన్ నెంబర్ ను కొన్ని చవకబారు మీడియా సంస్థలు బహిర్గతం చేశాయని మండిపడ్డారు. తద్వారా తనకు సెకన్ కు ఓ కాల్ వస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తన ఫోన్ నెంబర్ ను మార్చబోతున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కేస్ ఫైల్ చేస్తానని చెప్పారు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సురేఖ వాణి కూడా డ్రగ్స్ కేసుపై క్లారిటీ ఇచ్చారు. తమకెలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసు ఎటు దారి తీస్తుందో చూడాలి.