యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పుట్టిన రోజు వేడుకలను ఫ్యామిలితో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా క్రేజీ ఫొటోషూట్ చేసింది. అభిమానులతో పంచుకున్న ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యంంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాలతో అరిస్తూ వస్తున్నారు. అయితే, నిన్న ఈ బ్యూటీ పుట్టిన రోజు వేడులను కుటంబ సభ్యులతో కలిసి జరుపుకుంది. ఫ్యామిలీతో బీచ్ లో కేక్ కట్ చేసి సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు కూడా అనుపమాకు శుభాకాంక్షలు తెలిపారు. తన బర్త్ డేకు సంబంధించిన ఫొటోలతో పాటు.. కొన్ని స్టన్నింగ్ ఫొటోలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంది. క్యాజువల్ వేర్ లో కుర్రభామ క్రేజీ పోజులతో మతులు పోగొట్టింది. తాజాగా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గ్లామర్ విందుకు దూరంగా ఉండే అనుపమా.. కొద్దిరోజులుగా అందాల విందుకు తెరతీస్తున్నారు. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళలను మైమరిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ కొంటెగా పోజులిస్తూ కవ్వించింది. థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. పుట్టనరోజు ఇలా రెచ్చిపోయి ఫొటోషూట్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నెవర్ బిఫోర్ స్టిల్స్ తో యంగ్ బ్యూటీ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కేరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ మరిన్ని అవకాశాలను అందుకుంటోందీ భామ. గతేడాది విడుదలైన ‘కార్తీకేయ 2’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. రీసెంట్ గా వచ్చిన ‘18 పేజెస్’తోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ప్రస్తుతం ‘డీజే టిల్లు 2’లో నటిస్తోంది.