బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ కాంబినేషన్ నాలుగోసారి సెట్ అయ్యింది. తాజాగా మేకర్స్ అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. ఇప్పటికే వీరి డుయోలో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో ఈ క్రేజీ కాంబినేషన్ నాలుగో సారి రిపీట్ కాబోతోందని వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ అధికారికంగా సినిమాను ప్రకటించారు.
ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈసారి మరింత భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. సోషియో ఫాంటసీగా పాన్ ఇండియా చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. ప్రొడక్షణ్ నెం.8గా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మున్ముందుకు వెల్లడిస్తామని చెప్పారు. అధికారికంగా ప్రకటన చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు.
మొత్తానికి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ‘కాంబినేషన్ లో ‘జులాయి’, ’సన్ ఆఫ్ సత్యనారాయణ’, చివరిగా ‘అలా వైకుంఠపురంలో’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందించాయి. ఈ క్రమంలో నాలుగోసారి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప2 : ది రూల్’ షూటింగ్ లో ఉన్నారు. ఈ రెండు చిత్రాలు ముగిశాక అలుఅర్జున్ - త్రివిక్రమ్ మూవీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్, స్టార్ కాస్ట్, టెక్నీషన్స్ ఎవరేది తెలియాల్సి ఉంది. మరోవైపు అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతోనూ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
The Dynamic duo reunite for the 4th time! 😍🌟
Icon StAAr & Our Darling director garu coming together for our 🤩
▶️ https://t.co/waj5E2VNOt
More Details Soon! 🔥 pic.twitter.com/Trd5To14h5