
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ఫ : ది రైజ్’. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇండియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అలాగే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న Pushpa The Rule సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అల్లు అర్జున్ అభిమానులు అదిరిపోయే న్యూస్ ను అందించారు. ‘పుష్ప: ది రైజ్’ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గుడ్ న్యూస్ అందింది.
తాజాగా ‘పుష్ఫ’ను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ఫ : ది రూల్’పై అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ‘పుష్ఫ రాజ్’ వచ్చేస్తున్నాడని ప్రకటించారు. రేపే హైదరాబాద్ లో గ్రాండ్ గా సీక్వెల్ కు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి ‘పుష్ఫ రాజ్’ మేనరిజాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌కి సీక్వెల్‌ను మేకర్స్ గతంలోనే ప్రకటించినప్పటికీ సినిమా షూటింగ్ ప్రారంభం కోసం సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అప్డేట్ తో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇక ఈ సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. అదే రేంజ్ లో చిత్ర రిలీజ్ కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. కేవలం అల్లు అర్జున్ మరియు బన్నీ రెమ్యూనరేషనే రూ.100 కోట్లకుపైగా ఉన్నాయని తెలుస్తోంది. పైగా చిత్రాన్ని మరింత మెరుగ్గా ప్రేక్షకులకు అందించేందుకు ఆధునాత టెక్నాలజీని వాడబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం మరింతగా ఖర్చు చేయనున్నారు. ఓవరాల్ గా పుష్ప 2 బడ్జెట్ ని నిర్మాతలు రూ 350 కోట్లు గా లాక్ చేసినట్టు తెలుస్తోంది.