ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హా (Allu Arha) చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్న విషయం తెలిసిందే. నెక్ట్స్ నటించబోయే చిత్రానికి ఈ స్టార్ కిడ్ తీసుకోబోయే రెమ్యునరేషన్ డిటేయిల్స్ షాకింగ్ గా ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హా స్టార్ కిడ్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బన్నీతో కలిసి అల్లరి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. క్యూట్ గా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అర్హాను ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొన్నాళ్లు తండ్రితో కలిసి సోషల్ మీడియాలో సందడి చేసిన అర్హ.. చైల్డ్ ఆర్టిస్ట్ గానూ వెండితెరపై అలరిస్తోంది.
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శాకుంతలం’ చిత్రంలో పిన్స్ భరత పాత్రలో నటించింది. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాను గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రంతో అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తెలుగులో అనర్గళంగా డైలాగ్స్ చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్హ మేకింగ్ వీడియోస్ హెల్ప్ అయ్యాయంటే ఈ బాలనటి క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..
ఇక నెక్ట్స్ అల్లు అర్హా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘దేవర’ (Devara) చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే మరికొద్దిరోజుల్లో అల్లు అర్హ కూడా సెట్స్ లో జాయిన్ కాబోతుందని తెలుస్తోంది. పదిరోజుల పాటు షూటింగ్ ఉండనుందని అంటున్నారు. మొత్తం సినిమాలో పది నిమిషాల పాటు నిడివి ఉంటుందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అల్లు అర్హ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ గ్గా మారింది. ఈమేకర్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. నిమిషానికే మేకర్స్ రూ.2 లక్షలు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తం పది నిమిషాలకు గాను రూ.20 లక్షలు పారితోషికం అందుకోనుందని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారుతోందనే చెప్పాలి. ఇక దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రాన్ని వర్క్ చేస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.