Allari Naresh : అల్లరి నరేష్ కొత్త చిత్రం టైటిల్ పోస్టర్, కేక పెట్టించింది

Surya Prakash   | Asianet News
Published : Apr 10, 2022, 12:26 PM IST
Allari Naresh : అల్లరి నరేష్ కొత్త చిత్రం టైటిల్ పోస్టర్, కేక పెట్టించింది

సారాంశం

ఈ చిత్రానికి “ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ క్రేజీ టైటిల్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.


కెరీర్ మొదలు నుంచీ కామెడీ సినిమాలకు అల్లరి నరేశ్ కేరాఫ్ అడ్రస్. కానీ, తన శైలికి భిన్నంగా 'నాంది' సినిమాలో సీరియస్ గా కనిపించారు. గతంలో నటించిన 'గమ్యం' 'శంభో శివ శంభో' 'మహర్షి' సినిమాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. చాలా రోజులుగా సరైన సక్సెస్  కోసం ఎదురుచూస్తున్న నరేశ్ కు ఈ చిత్రం మంచి ఫలితాన్నిచ్చింది. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు రూపొందించిన 'నాంది' సినిమా నరేష్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది. దాంతో నరేష్ మరోసారి ఓ సీరియస్ కథతో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం నరేష్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి “సభకు నమస్కారం”. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక మరొక చిత్రం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా టైటిల్‌ని ప్రకటించారు.

 
ఈ చిత్రానికి “ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ క్రేజీ టైటిల్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?