అలియా భట్ ప్రెగ్నెన్నీఅనౌన్స్.. దీపికా పదుకొణె, కత్రినాపై నెటిజన్ల కామెంట్స్.. ఎమంటున్నారంటే?

Published : Jun 27, 2022, 03:19 PM ISTUpdated : Jun 27, 2022, 03:22 PM IST
అలియా భట్ ప్రెగ్నెన్నీఅనౌన్స్.. దీపికా పదుకొణె, కత్రినాపై నెటిజన్ల కామెంట్స్.. ఎమంటున్నారంటే?

సారాంశం

బాలీవుడ్ స్టార్ కపుల్ రన్బీర్ కపూర్ - అలియా భట్ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అలియా భట్ తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్స్ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ లపై పలు రకాలు కామెంట్స్ చేస్తున్నారు.  

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీలు నార్త్ తోపాటు, సౌత్ ఆడియెన్స్ కు కూడా చాలా దగ్గరైపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలుతున్న తారల్లో వీరు ముగ్గురు ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈ బ్యూటీ తమ కేరీర్ ను ఎంత చక్కగా  బిల్డ్ చేసుకున్నారో.. పర్సనల్ లైఫ్ లోనూ అంతే శ్రద్ధ వహించారు. తమ భాగస్వామ్యులను వారి అభిరుచులకు తగ్గట్టుగా ఎంచుకున్నారు. సంప్రదాయ పద్దతుల్లోనే గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. 

దీపికా పదుకుణె (Deepika Padukone) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. అంటే దీపికా పాపులారిటీ ఏ  రేంజ్ లో అర్థం చేసుకోవచ్చు. అయితే దీపికా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ (Ranveer Singh)ను 2018లో వివాహం చేసుకుంది. అంతకు ముందే డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేళలకు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) కూడా తన బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను గతేడాది చివర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంది.  భర్తతో కలిసి వేకేషన్స్ కు వెళ్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగుతోంది.

ఇక అందాల హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఈ ఏడాది ఏప్రిల్ 12న బాలీవుడ్ లవ్ బాయ్ రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ముంబైలోని ఓ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా అలియా భట్ సర్ ప్రైజింగ్ న్యూస్ రివీల్ చేసింది. త్వరలో ఆమె తల్లికాబోతున్నట్టు ఈ రోజు ఉదయం ఓ ఫొటోను షేర్ చేసుకుంటూ ప్రకటించింది. దీంతో ఇండస్ట్రీ నుంచి, ఆమె అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

అయితే, రన్బీర్ - అలియా పెళ్లైయినా రెండు నెలలకే దంపతులు కాబోతున్నట్టు ప్రకటించడం పట్ల నెటిజన్లు దీపికా పదుకొణె,  కత్రినా కైఫ్ లపై పలు రకాలు కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రెండు నెలలకే అలియా తల్లి కాబోతున్నట్టు ప్రకటించినా.. ఇన్నెళ్లయినా దీపికా పదుకొణె, కత్రినా ఎప్పుడు ప్రకటిస్తారోనంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తల్లిదదండ్రులుగా మారడం వారి వ్యక్తిగత అంశం.. దానిపై ఎవరూ అభిప్రాయం వ్యక్తం చేసినా చెల్లదంటూ స్పందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?