పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ ఫిక్స్! బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్!

Published : Jul 02, 2023, 05:32 PM IST
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ ఫిక్స్! బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్!

సారాంశం

మరోసారి త్రివిక్రమ్-కాంబో సెట్ అయ్యింది. రేపు దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఫ్యాన్స్ లో హంగామా నెలకొంది.   

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. ఇప్పటికి మూడు చిత్రాలకు కలిసి పని చేశారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఓ మోస్తరు విజయాలు సాధించాయి. హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసి 2020 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కెరీర్లో మొదటిసారి అల్లు అర్జున్ అతిపెద్ద విజయం చూశాడు. 

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ విడుదలకు ముందే కొత్త చిత్ర ప్రకటన చేస్తున్నారు. రేపు ఉదయం 10:08 గంటలకు త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీపై అప్డేట్ రానుంది. ఈ మేరకు నిర్మాతలు తెలియజేశారు. డిటైల్స్ వారు చెప్పుకున్నప్పటికీ రేపు వారు చేయబోయే ప్రకటన అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ గురించే అని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. 

పుష్ప 2 షూట్ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ కానుంది. ఇక త్రివిక్రమ్ గుంటూరు కారం చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 2024 సమ్మర్లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇతర నటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. ఆయన యూనివర్సల్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. త్రివిక్రమ్ కథలేమో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటాయి. త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్స్ ఇతర భాషల్లో కనీస ఆదరణ దక్కించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి త్రివిక్రమ్ కి ఈ ప్రాజెక్ట్ పెద్ద సవాల్ అని చెప్పాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?