మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ‘బ్రో’ టీజర్ తర్వాత గురూజీని ఆడేసుకుంటున్నారు. బుట్టబొమ్మ ఇందులోకి లాగి మరీ రచ్చ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రచనలు, డైలాగ్స్, కథలు, డైరెక్షన్ తో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. అంతటి స్థాయికి వెళ్లినా ఆయనకు ట్రోల్స్ బాధ తప్పడం లేదు. సోషల్ మీడియా ప్రపంచం వచ్చాక అవతల ఎవరనేది చూడటం లేదు. ప్రతి విషయాన్ని నెటిజన్లు ఎత్తి చూపుతూనే ఉన్నారు. ట్రోల్స్ తో మంటపెడుతున్నారు.
‘బ్రో టీజర్’ విడుదల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద మళ్లీ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించారు. టీజర్ కూడా అదిరిపోయింది. మంచి రెస్పాన్స్ దక్కుతోంది. హైప్ క్రియేట్ అయ్యింది. మరీ ట్రోల్స్ ఎందుకంటారా? అందుకు కారణం బుట్టబొమ్మ అంటున్నారు. ఎందుకంటే.. బ్రో టీజర్ ముందు పూజా హెగ్దే (Pooja Hegde) నటించిన ఓ కమర్షియల్ యాడ్ రావడం నెటిజన్ల కంట పడింది.
దీంతో పూజా హెగ్దే లేనిదే గురూజీ ఏసినిమా చేసేలా లేరే? అంటూ ఆడేసుకుంటున్నారు. మరోవైపు ఈ యాడ్ లో నటించేందుకే పూజాను సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ నుంచి తప్పించి ఉంటారంటూ అభిప్రాయపడుతున్నారు. ‘బుట్టబొమ్మను వదిలేదేలే‘, ‘పూజా హెగ్దే లేనిది సినిమాలు తీయారా?’, ’ఏదో రకంగా బుట్టబొమ్మ కనిపించాల్సిందే?’, ’త్రివిక్రమ్ ు లక్కీ హీరోయిన్ పూజా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ పూజా హెగ్దే కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’, ’అలా వైకుంఠపురంలో’ చిత్రాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయ. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లోనూ పూజా హెగ్దే హీరోయిన్. కానీ తప్పుకున్నట్టు రూమర్లు వచ్చాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనలేదు. ఇదిలా ఉంటే.. బ్రో ట్రీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. తమిళ స్టార్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతికా, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.