Acharya Trailer: ఆచార్య ట్రైలర్ లో కనిపించని కాజల్... త్రిష తప్పుకోవడంలో తప్పులేదు!

Published : Apr 12, 2022, 09:54 PM IST
Acharya Trailer: ఆచార్య ట్రైలర్ లో కనిపించని కాజల్... త్రిష తప్పుకోవడంలో తప్పులేదు!

సారాంశం

ఆచార్య మూవీ మెయిన్ హీరోయిన్ కాజల్ ట్రైలర్ లో మచ్చుకైనా కనిపించలేదు. చరణ్ తో జోడి కట్టిన పూజా రెండు షాట్స్ లో కనిపించగా, అసలు కాజల్ జాడ లేకపోవడం చర్చనీయాంశమైంది.   


కొరటాల సినిమాల్లో కథ చాలా బలంగా ఉంది. అదే సమయంలో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్, మిర్చి మూవీలో అనుష్క పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.  ఇక జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల్లో కూడా హీరోయిన్స్ చెప్పుకోదగ్గ నిడివి కలిగి ఉన్నారు. అయితే ఆచార్య మూవీలో హీరోయిన్స్ కి అంత ప్రాధాన్యత ఉండదేమో అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే ఈ అనుమానం బలపడుతుంది. ఆచార్య ట్రైలర్ లో హీరోయిన్ కాజల్ అసలు కనిపించలేదు. 

సినిమా కథను బట్టే ట్రైలర్ ఉంటుంది. ట్రైలర్ కట్ లో ప్రధాన పాత్రలకు దాదాపు స్పేస్ ఉంటుంది. కానీ ఆచార్య ట్రైలర్ (Acharya Trailer) లో కాజల్ కి చోటు దక్కలేదు. చరణ్ కి జంటగా నటిస్తున్న పూజా హెగ్డే సైతం ట్రైలర్ లో కనిపించగా, కాజల్ ని మాత్రం మచ్చుక కూడా చూపించలేదు. ఆచార్య మూవీలో చరణ్ (Ram Charan)ది గెస్ట్ రోల్ మాత్రమే. అరగంటకు పైగా నిడివి ఉండే కీలక రోల్ అనేది సమాచారం. గెస్ట్ రోల్ కి హీరోయిన్ గా చేస్తున్న పూజా(Pooaj Hegde)ను పరిచయం చేసిన చిత్ర యూనిట్ కాజల్ ని పట్టించుకోలేదు. 

కాగా ఆచార్య సినిమాలో చిరంజీవి(Chiranjeevi)కి జంటగా త్రిషను తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆచార్యలో తన పాత్రకు కనీస ప్రాధాన్యత లేదనే కారణంగానే త్రిష తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న కాజల్ ని తర్వాత హీరోయిన్ గా తీసుకున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత త్రిష ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంలో అర్థం ఉంది. కాజల్ మాత్రం రెమ్యూనరేషన్ కోసం కమిటై ఉండవచ్చని క్లారిటీ వచ్చింది. 

అయితే ట్రైలర్ చూసి ఒక నిర్ధారణకు రాలేము. కాబట్టి దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదల కావల్సిందే. ఇక ఆచార్య ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. సిల్వర్ స్క్రీన్ పై చరణ్, చిరంజీవి వీర విహారం చేయనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఏప్రిల్ 29న ఆచార్య విడుదలవుతుండగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?