ఊహించని విధంగా చిరంజీవి కరోనా బారిన పడ్డారన్న వార్త బయటికి వచ్చింది. ‘ఆచార్య’ కోసమే కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చిరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయినా చిరు అందుబాటులో లేకపోయినా ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఆగటం లేదు.
ఈ సోమవారం నుంచి చిరంజీవి తన తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభించడం కోసం ఆయన ప్లాన్స్ వేసుకున్నారు. దీని గురించి అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. ఈలోగా ఊహించని విధంగా చిరంజీవి కరోనా బారిన పడ్డారన్న వార్త బయటికి వచ్చింది. ‘ఆచార్య’ కోసమే కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చిరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయినా చిరు అందుబాటులో లేకపోయినా ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఆగటం లేదు.
మొదట ప్లాన్ ప్రకారమే సోమవారం ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభించారు. చిరు నుంచి కరోనా సమాచారం అందగానే ప్రొడక్షన్ టీం ప్లాన్ మార్చుకుంది. ఆయన లేని సీన్స్ షూట్ చేయటానికి ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు చేసుకున్నారని తెలుస్తోంది. చిరు రెండు వారాల్లో కోలుకుని షూటింగ్‌కు వస్తారని ఆశిస్తోంది చిత్ర టీమ్. ఈలోపు ఆయన లేని సీన్స్ అన్నీ పూర్తి చేస్తారు.
‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ప్రమఖ దర్శకుడు... కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా... ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో 40 శాతం షూటింగ్ పూర్తియింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిరవధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది. ఇన్నాళ్లకూ మళ్లీ ప్రారంభమైంది.
పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.