రెండు రెట్లు గ్రాఫిక్స్..జీరో గ్రావిటి కథ (‘2.0’మూవీ రివ్యూ)

By Udayavani Dhuli  |  First Published Nov 29, 2018, 2:20 PM IST

వచ్చి చాలాకాలం అయినా చిట్టి 'రోబో' ని జనం ఇంకా మర్చిపోలేదు. ఆ తర్వాత శంకర్ రెండు సినిమాలు చేసినా జనం ఇట్టే మర్చిపోయారు. ఆ విషయం గమనించిన శంకర్...హిట్ కోసం తన చిట్టినే ఆశ్రయించాలని డిసైడ్ అయ్యాడు. 


---సూర్య ప్రకాష్ జోశ్యుల

వచ్చి చాలాకాలం అయినా చిట్టి 'రోబో' ని జనం ఇంకా మర్చిపోలేదు. ఆ తర్వాత శంకర్ రెండు సినిమాలు చేసినా జనం ఇట్టే మర్చిపోయారు. ఆ విషయం గమనించిన శంకర్...హిట్ కోసం తన చిట్టినే ఆశ్రయించాలని డిసైడ్ అయ్యాడు. అయితే చిట్టి...అప్పటి ప్రేమ పాఠాలే వల్లిస్తూ.. లవ్ స్టోరీలు నడిపితే రిపీట్ అయ్యినట్లుంటుందని సెల్ ఫోన్స్.. పర్యావరణం.. పరిరక్షణ...అంటూ కాకి మార్క్ విలన్ ని తెచ్చి కథ చెప్తున్నాడు. అయితే ఇది కాకమ్మ కధగా మిగులుతుందా లేక.. కలకలం రేపే సినిమా అవుతుందా.. అంటూ జనం కలవరించే స్దాయికి ప్రమోషన్ తో బిల్డ్ చేసారు.

Latest Videos

undefined

దాంతో ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెరిగాయి. అంచనాలను అందుకోవటం శంకర్ కు కొత్తేమీ కాదు కానీ..ఈ మధ్యన అందుకోలక పడిపోవటం అనే విద్యను సైతం అభ్యసించాడు కాబట్టే కాస్తంత డౌట్.ఆ  డౌట్ ని క్లియర్ చేయటానికే ఈ రివ్యూ డిటేల్డ్ ఇస్తున్నాం...కథేంటి...ఎక్స్ పెక్టేషన్స్ అందుకున్నాడా..ఆ పక్షులు సెల్ ఫోన్స్ ఎత్తుకుపోవటం ఏమిటి...చిట్టి ఈ సారి అప్ గ్రేడ్ అయ్యి వచ్చి ఏం చేసాడు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

 

కథేంటి..

సెల్ ఫోన్స్ పై  ప్రతీ క్షణం ఆధారపడుతున్న ఈ రోజుల్లో హఠాత్తుగా అవన్నీ మాయమైపోతే ఏమౌతుంది..అసలు ఆ ఆలోచనే భయంకరంగా ఉంది కదూ...కానీ  రోజు చెన్నైలోని అందరూ సెల్ పోన్స్ ఊహించని రీతిలో మాయమైపోవటం మొదలైంది. మాట్లాడుతూడంగానే  వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతూంటే ఎవరికీ ఏం చేయాలో అర్దం కాదు. సెల్ ఫోన్స్  లేని ప్రపంచాన్ని ఎవరూ భరించలేకపోతూంటారు. ప్రభుత్వానికి ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. కానీ ఎవరు ఎత్తుకెళ్తున్నారో తెలిస్తే దానికు పరిష్కారం కనిపెట్టచ్చు. కానీ చిన్న క్లూ కూడా దొరకదు. సెల్ టవర్స్ సైతం కూలిపోతూంటాయి. 

భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని సైంటిస్ట్ లు తేలుస్తారు కానీ పరిష్కారం చెప్పలేకపోతారు.  మరో ప్రక్క సెల్ ఫోన్స్ ఓ సుడిగాలిలా వచ్చి టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ని ,సెల్ పోన్స్ అమ్మే షాప్ ఓనర్ ని చంపేస్తాయి.  దాంతో ప్రజలు భయపడిపోతూంటారు. ఆ క్రమంలో ప్రభుత్వం మిలిట్రీని పిలిచి సెల్ టవర్స్ దగ్గర కాపాలా పెట్టి ఈ ఇబ్బందినుంచి బయిట పడాలనుకుంటారు. కానీ వాళ్లు సైతం చేతులు ఎత్తేస్తారు. 

అప్పుడు ప్రభుత్వం  డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) సహాయం అడుగుతుంది. అప్పుడు వశీకరణ్   రంగంలోకి దిగి దీన్ని  చిట్టి ‘ద రోబో’మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. అప్పుడు అసలు ఆ సెల్ ఫోన్స్ ఎత్తుకుపోతున్న  శక్తి ఏమిటనేది ట్రాక్ చేస్తే ఓ పక్షిరాజా  (అక్ష‌య్ కుమార్‌)అని అర్దమవుతుంది. అసలు పక్షిరాజా ఎవరు..అతనికున్న శక్తిలేమిటి.ఈ సెల్ ఫోన్స్ మాయం చేసి ఎత్తుకుపోయి వ్యాపారం ఏమన్నా పెట్టుకుంటున్నాడా..అతని అసలు ఆలోచన ఏమీటి..పక్షిరాజాని చిట్టి సాయింతో వశీకరణ్ ఎలా కంట్రోలు చేస్తాడు. పక్షిరాజా ప్లాష్ బ్యాక్ ఏమిటి...ఈ సినిమాలో అమీజాక్సన్ పాత్ర ఏమిటనేది తెరపై చూడాల్సిన మిగతా కథ. 

ఎలా ఉంది..

ఇలాంటి సినిమాలు చేయాలంటే టెక్నికల్ గా చాలా విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాలను తెలివిగా కథలో చొప్పించగలగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా 'సోల్' లేని సోది సినిమాగా మారిపోతుంది. ఆ విషయంలో శంకర్ పండిపోయాడని మనకు రోబోలోనే అర్దమవుతుంది. అలాగే శంకర్ మరో ప్లస్ పాయింట్..సామాజిక సమస్యను ముడిపెడుతూ ..ఓ ముడి సరుకులా వాడుతూ కథ చెప్పటం. ఆ విషయంలోనూ ఈ సినిమా ఫస్ట్ క్లాస్ లో పాసైంది. ప్రంపచం ..కేవలం మనుష్యులకే కాదు..మిగతా జీవరాసులుది కూడా అనే విషయం సూటిగా గుచ్చుకునేలా చెప్పే ప్రయత్నం చేసాడు. అంత మంచి విషయాన్ని సినిమాగా చెప్పాలనే ఆలోచన గొప్పది అందుకు శంకర్ ని అభినందించాలి. అయితే ఆ విషయాన్ని సవ్యంగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. 

క్యారక్టర్స్ రివర్స్.. పెద్ద మైనస్ 

ఈ సినిమా దెబ్బ కొట్టిందల్లా...తాను అనుకున్న సామాజిక సమస్యను కథా రూపంలో విస్తరించటం. కేవలం గ్రాఫిక్సేనే నమ్ముకుని అక్షయ్ కుమార్ చేసిన  పక్షిరాజా క్యారక్టర్ ని చూపెడుతూ..సినిమాని లాక్కెళ్లదామనుకున్నాడు. అంతేకానీ పక్షిరాజా పాత్ర..మంచిదా చెడ్డదా అనేది క్లారిటీ ఇవ్వలేకపోయాడు. పక్షులకు పరిరక్షకుడుగా..సెల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ కు వ్యతిరేకంగా పోరాడే ఆ పాత్ర నిజంగాని చాలా మంచిదే. అయితే సినిమాలో ఆ పాత్రపైనే హీరో రజనీకాంత్ పోరాటం మొదలెడతాడు. దాంతో మనకు రజనీ చేసేది మంచి పని అనిపించదు. అంత మంచి ధాట్ ఉన్న వ్యక్తి ...ఆవేదనతో యుద్దం  ప్రకటిస్తే ...అతనే హీరో అనిపిస్తాడు. అతన్ని నాశనం చేయాలనుకునే రజనీ పాత్ర విలన్ అనిపిస్తుంది. 

సబ్ ప్లాట్స్ లేవు..

అప్పట్లో వచ్చిన రోబో పూర్తి  స్దాయి కమర్షియల్ సినిమా. అందులో హీరో,విలన్, హీరోయిన్ తో లవ్, ఫన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ విలన్ ఎవరనేది ఎలాగో క్లారిటీ మిస్సైంది. ఇక ఫన్ అంటారా జీరో, లవ్ సీన్స్ సైతం సీన్స్. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కూడా రోబోనే. అందుకని లవ్ సీన్స్ కు అవకాశమే లేదు. దాంతో సినిమా కేవలం రజనీకు, అక్షయ్ కు మద్య జరిగే పోరుగా తప్ప వేరే సీన్స్ ఏమీ కనపడవు. 

హైలెట్స్..

ఈ సినిమాలో ప్రధాన హైలెట్ అక్షయ్ కుమార్ గెటప్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే  భారీ ఎపిసోడ్. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ లో మరో రజనీక్యారక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయటం సూపర్ గా ఉంది.  కానీ ఆ ఎపిసోడ్ లెంగ్త్ బాగా ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. 

ఇలా చేసేవేంటి శంకర్..

ఇక ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీస్తున్నాం కదా ...పాటలెందుకు అనుకున్నట్లున్నారు శంకర్. కానీ ఇలాంటి సినిమాలకు పాటలు ఇచ్చే రిలీఫ్..కిక్ వేరు. రజనీకాంత్, అమీ జాక్సన్ వంటి స్టార్స్ తో పాటలు లేకపోవటం ఇబ్బందిగా ఉంటుంది.  పాటలే లేనప్పుడు ఎఆర్.రహమాన్ సంగీతం ఇచ్చినా పెద్ద కలిసొచ్చేముంటుంది..కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తప్ప..

టెక్నికల్ గా...

ఈ సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్దాయికు వెళ్లి తీర్చిదిద్దారు. చాలా సీన్స్ విజువల్ ట్రీట్ గా అనిపిస్తాయి. అయితే కథ,ఎమోషన్ ఉంటేనే కదా..విజువల్స్ కు నిండుతనం. అది లేనప్పుడు చాలా పేలవంగా ..ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది.  నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్.   ఇక ఆంటోని ఎడిటింగ్ బాగుంది కానీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది.   నిర్మాణ విలువలు బాగున్నాయి . 
 
ఫైనల్ ధాట్...

గాడ్జిల్లా కథకు పర్యావరణ నేపధ్యం కలిపినట్లున్న ఈ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుంది. పిల్లల మనస్సు ఉన్న పెద్దలకు నచ్చుతుంది. కథ, ఎమోషన్ అంటూ వెతికే వారికి పెద్ద వెలితిగా కనిపిస్తుంది. 
 

రేటింగ్: 2.75/5 

                                    

 

నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాంజాన్‌, రియాజ్‌ఖాన్‌ తదితరులు
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా
ఎడిటింగ్‌: ఆంథోని
ఆర్ట్‌: టి.ముత్తురాజు
వీఎఫ్‌ఎక్స్‌ అడ్వైజర్‌: శ్రీనివాసమోహన్‌
ఫైట్స్‌: సెల్వ
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్‌
సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 29-11-2018

 

click me!