నిన్న రెండో రోజు శనివారం వీకెండ్ కు బాగానే కలెక్షన్స్ వస్తాయని అందరూ భావించారు. కానీ యాభై లక్షల కన్నా తక్కువ కలెక్షన్స్ రావటం షాక్ ఇచ్చింది. రవితేజ కెరీర్ లో ఈ మధ్యన ఇంత తక్కువ కలెక్షన్స్ రావటం దారుణం అంటోంది ట్రేడ్. మరో ప్రక్క విక్రమ్ రోణా కు తెలుగు నాట కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ తో ఈ సినిమా తెలుగు రాష్టాల్లో నిలబడిపోయింది. ముఖ్యంగా బి,సి సెంటర్లలలో ఈ సినిమాకు ఆదరణ బాగుంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ లభించింది. అయితే ఉన్నంతలో రిలీజ్ రోజు మార్నింగ్ షోకు ఓపినింగ్స్ ఫరవాలేదనిపించాయి. కానీ మాట్నీ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
నిన్న రెండో రోజు శనివారం వీకెండ్ కు బాగానే కలెక్షన్స్ వస్తాయని అందరూ భావించారు. కానీ యాభై లక్షల కన్నా తక్కువ వరల్డ్ వైడ్ షేర్ రావటం షాక్ ఇచ్చింది. రవితేజ కెరీర్ లో ఈ మధ్యన ఇంత తక్కువ కలెక్షన్స్ రావటం దారుణం అంటోంది ట్రేడ్. మరో ప్రక్క విక్రమ్ రోణా కు తెలుగు నాట కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ తో ఈ సినిమా తెలుగు రాష్టాల్లో నిలబడిపోయింది. ముఖ్యంగా బి,సి సెంటర్లలలో ఈ సినిమాకు ఆదరణ బాగుంది.
మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్ హిట్ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో చేసాడు రవితేజ. తన స్టయిల్‌ని పక్కన పెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ని పట్టాలు ఎక్కించాడు.
1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు శరత్ మండవ. ఇదొక ఎమోషనల్ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి.