ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభను సోమవారం నాడు నర్సరావుపేటలో నిర్వహించారు.
నర్సరావుపేట: పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు.
సోమవారం నాడు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభ జరిగింది.ఈ సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాద్ రావు విగ్రహాన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.
భయమంటే ఎరుగని వ్యక్తి కోడెల శివప్రసాద్ రావు అని చంద్రబాబునాయుడు ఈ సభలో ఆయన గురించిన విషయాలను ప్రస్తావించారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కోడెల శివప్రసాద్ రావుకు ఉందన్నారు. కోడెలపై కేసులు ఎలా పెడతారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
కోడెల శివప్రసాద్ రావు చనిపోయిన విధానాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టుగా ఆయన చెప్పారు. పల్నాడు టైగర్ గా కోడెల శిపవ్రసాద్ రావు గుర్తింపు పొందిన విషయాన్ని ఆయన ఈ సభలో గుర్తు చేశారు.
అంతకుముందు కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాం మాట్లాడారు. 15 రోజులుగా పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలిచారని చెప్పారు. తనకు ధైర్యం చెప్పారన్నారు.
రూపాయికే వైద్యం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కోడెల శివప్రసాద్ రావు చిరస్థాయిగా నిలిచిపోయారని శివరాం చెప్పారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబుకు శివరాం ధన్యవాదాలు తెలిపారు.