రూ.200 కోట్లతో కంటైనర్ రెస్టారెంట్... అల్లూరి స్వగ్రామంలో కూడా: మంత్రి అవంతి

By Arun Kumar PFirst Published Oct 21, 2019, 4:23 PM IST
Highlights

విశాఖ పోలీసులు నిర్వహించిన అమరవీరుల వారోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పోలీసులపై పొగడ్తలు గుప్పించారు.  

విశాఖ పట్నం: భీమిలి బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఎర్రమట్టి దిబ్బలు వద్ద టూరిజం శాఖ 200 కోట్లతో నిర్మించిన కంటైనర్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాటలాడుతూ... విశాఖ నుండి భీమిలి వరకు ఉన్న అందమైన బీచ్ లు ప్రకృతి వరప్రసాదమని...వీటిని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖ జిల్లాలో అనేక చారిత్రాత్మక, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని, వాటిని కొద్దిగా తీర్చిదిద్ది ప్రచారం కల్పించినట్లయితే అంతర్జాతీయ పర్యాటకులతో పాటు స్వదేశీ పర్యాటకులు కూడా ఎక్కువమంది ఆకర్షితులవుతారు అన్నారు. 

విశాఖ సమీపంలోని పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన స్థలమని... అక్కడ కూడా ఒక రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

ఈ కంటైనర్ రెస్టారెంట్ అందమైన గార్డెన్, సుందర సాగర తీరం అందాలను తిలకించేలా మంచి వివ్ పాయింట్ లో వుందన్నారు. అలాగే రెస్టారెంట్ కూడా ఎంతో సౌకర్యవంతంగా, ఆహ్లాదంగా ఉంటుందని తెలిపారు.
జల సొమ్ము దోచుకోవడం కాదు...నా సొమ్మే ప్రభుత్వం...: శ్రీభరత్..

అంతకుముందు పోలీసు అమర వీరుల సంస్మరణ వేడుకల్లో భాగంగా బీచ్ రోడ్డులోని అమర వీరుల స్థూపం వద్ద మంత్రి నివాళులు అర్పించారు. నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ కలిని మంత్రి పోలీస్ అమరవీరులకు గౌరవ వందనం చేశారు.   అమర వీరుల సేవలను స్మరిస్తూ అంజలి ఘటించారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ... వ్యవస్థను గాడిలో పెట్టడానికి పోలీసులు ఎంతగానో దోహదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  పోలీసుల సేవలను గుర్తించి వారికి భరోసా ఇచ్చేలా తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ మేరకు వారంతపు సెలవుతో పాటుగా పోలీసు కుటుంబాలుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. 

సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ... విధి నిర్వహణలో భాగంగా ఎందరో పోలీసులు ప్రాణ త్యాగాలు చేసారని కీర్తించారు. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో  219 మంది అసువులు బాసారని... వారి సేవలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 
  

click me!
Last Updated Oct 21, 2019, 4:29 PM IST
click me!