ఏపి స్థానికసంస్థల ఎన్నికలు... అటవీ అధికారులకు కీలక బాధ్యతలు

By Arun Kumar PFirst Published Mar 10, 2020, 3:53 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ స్థానికసంస్థల ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా అటవీశాఖ అధికారులకు ఎన్నికల కమీషన్ కీలక బాధ్యతలు అప్పగించింది.  

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది ఈసీ. అటవీశాఖ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించింది.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. 

ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు అటవీశాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్  నియమించడం జరిగింది. వారితో పాటుగా మరో నలుగురు అధికారులను రిజర్వులో నియమించడం జరిగింది.

 జిల్లాల వారిగా అధికారుల వివరాలు

పి.రామ కృష్ణ - కృష్ణా జిల్లా

బిఎన్ఎన్ మూర్తి - గుంటూరు జిల్లా

ఎం. శివ ప్రసాద్ - కర్నూలు జిల్లా

ఆర్. యశోదా బాయి - శ్రీకాకుళం జిల్లా   

అలాన్ చోంగ్ టెరోన్ - వైఎస్సార్ కడప జిల్లా 

సి.సెల్వం - తూర్పుగోదావరి జిల్లా 

డాక్టర్ శేఖర్ బాబు గెడ్డం - ప్రకాశం జిల్లా

కుమారి నందిని సలేరియా - విశాఖపట్నం జిల్లా

జగన్నాథ్ సింగ్ -చిత్తూరు జిల్లా

అనంత్ శంకర్ -  పశ్చిమగోదావరి జిల్లా

నరేంథరన్ జిజి - అనంతపురం జిల్లా

సందీప్ కృపాకర్ గుండాలా - విజయనగరం జిల్లా

సునీల్ కుమార్ - నెల్లూరు జిల్లా  

వీరికి అదనంగా నలుగురు సీనియర్ అధికారులు టి. జ్యోతి, షేక్ సలాం,  వై.శ్రీనివాస రెడ్డి,  శ్రీకాంతనాథ్ రెడ్డిలను రిజర్వు లో నియమించడం జరిగిందని ఎన్నికల కమీషనర్ వెల్లడించారు. 
 

click me!