విమానం అత్యవసర ల్యాండింగ్...ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

Published : Nov 15, 2019, 09:19 PM IST
విమానం అత్యవసర ల్యాండింగ్...ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

సారాంశం

విశాఖ పట్నం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అండమాన్ నుండి డిల్లీకి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  

విశాఖపట్నం: అండమాన్ నుండి  ఢిల్లీ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విశాఖ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 

ఎయిర్ ఇండియా కు చెందిన 488 నెంబర్ గల విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా విశాఖలో నిలిపినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలోని 90 మంది ప్రయాణికులకు విశాఖలో వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. విమానంలోని సాంకేతిక లోపాన్ని సరిచేసేవరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. 

read more  వైసిపి ఎంపీలతో జగన్ భేటీ... పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహమిదే

విమానంలో సాంకేతిక లోపాన్ని పైలెట్ ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదకర సంఘటనలు లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...