WHO: 87,000 టన్నుల PPE కిట్ల వ్య‌ర్థాలు.. వైద్య వ్యర్థాలను నిర్వ‌హ‌ణ పెను స‌వాలు

By Rajesh K  |  First Published Feb 1, 2022, 4:26 PM IST

WHO: ప్రపంచ దేశాలను క‌రోనా మహమ్మారి ద్వారా ఏర్పాడిన వైద్య వ్యర్థాలను సవాలు చేస్తున్నాయ‌నీ, దాదాపు  పదివేల టన్నుల  వైద్య వ్యర్థాలను ఏర్ప‌డయ‌ని WHO ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంది. ఈ వ్య‌ర్థాల ద్వారా  మానవ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు కలిగిస్తుందని డ‌బ్యూహెచ్ఓ తెలిపింది.
 


WHO: ప్రపంచ దేశాల‌ను కరోనా గడగడలాడించింది. ఈ మ‌హమ్మారి కారణంగా ఏర్ప‌డిన వైద్య వ్యర్థాలను సవాలు విసురుతున్నాయి. ప్ర‌పంచ మాన‌వాళికే కాదు.. భూ మండలానికి కూడా తీరని నష్టం వాటిల్లిత్తుంద‌ని WHO ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంది. దాంతో మరొక మహమ్మారి భవిష్యత్తులో విలయతాండవం చేసే ప్రమాదం ఉంద‌నే ఆందోళనలు వ్య‌క్తం చేస్తుంది.  కోవిడ్-19 (Covid 19) విజృంభించిన సమయం నుంచి వైద్య వ్యర్థాలు భయాందోళ‌న క‌లుగ‌చేస్తున్నాయి
 
 కోవిడ్-19 టెస్టింగ్ సిరంజిలు, టెస్ట్ కిట్లు,  వ్యాక్సిన్ బాటిళ్లు త‌దిత‌ర వైద్య వ్య‌ర్థాలు  ఏర్పాడుతున్నాయి. ఈ వ్య‌ర్థాల‌తో ఇప్ప‌టివ‌ర‌కూ పదివేల టన్నుల వైద్య వ్యర్థాలను ఏర్పడాయని WHO తెలిపింది. ఈ వ్య‌ర్దాల‌తో మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. 

ప్లాస్టిక్‌కు రద్దీని కలిగించిన ప్యాకేజింగ్‌ను తగ్గించడం.   పునర్వినియోగపరచదగిన మరియు పునర్వినియోగపరచదగిన పదార్థాలతో తయారు చేసిన రక్షణ గేర్‌ల వాడకంతో సహా సంస్కరణలు మరియు పెట్టుబడి కోసం నివేదిక పిలుపునిచ్చింది.

Latest Videos

ప్ర‌పంచ వ్యాప్తంగా నవంబరు 2021 వరకు దాదాపు 87,000 టన్నుల  PPE కిట్ల వ్య‌ర్థాలు ఉన్నాయ‌నీ, ఈ వ్యర్థాలు.. దాదాపు ఏడు వందల నీలి తిమింగలాల బరువుకు సమానమ‌నీ UN అంచనా వేసింది.  అలాగే.. 2,600 టన్నుల ప్లాస్టిక్ చెత్తను ఏర్ప‌డిన‌ట్టు తెలింది.  140 మిలియన్ టెస్ట్ కిట్‌లను వ్య‌ర్థాలున్నట్టు పేర్కొన్నది డబ్యూహెచ్ ఓ.  అలాగే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లు సీసాలు, సిరంజిలు, సూదులు, సేఫ్టీ బాక్సుల రూపంలో అదనంగా 144,000 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేశాయని అంచనా వేసింది. 
 
వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, వ్య‌ర్థాల‌ను కాల్చ‌డం వ‌ల్ల నీటి నాణ్య‌త‌, వ్యాధి వాహ‌క తెగుళ్ల వ‌ల్ల గాలి క‌లుషితమ‌వుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాలలోకి ప్రవేశిస్తున్నాయ‌ని, కరోనా చికిత్సకు సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా వరకు నదుల నుంచి సముద్రంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొంది. మహాసముద్రాలలోకి దూసుకొస్తున్న ప్లాస్టిక్‌లో 73 శాతం ఆసియా నదుల నుంచి వచ్చినవేనని వెల్లడించింది.

click me!