కరోనాపై అవిశ్రాంత పోరు: భారత్‌కు వరల్డ్ బ్యాంక్ రూ. 7,600 కోట్ల భారీ సాయం

By Siva Kodati  |  First Published Apr 3, 2020, 3:22 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయనిధిలో భాగంగా తొలివిడతలో 1.9 బిలియన్ డాలర్ల‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు 1 బిలియన్ డాలర్లు ( రూ.7,600 కోట్లు) సాయాన్ని కేటాయించింది.


కరోనా వైరస్‌ను నిరోధించేందుకు అన్ని దేశ ప్రభుత్వాలు తమ శక్తికి మించి పోరాడుతున్నాయి. గెలుస్తామో లేదో అన్న సంగతిని పక్కనబెట్టి మరీ కోవిడ్‌పై యుద్ధాన్ని ఆరంభించాయి.

ఆ దేశాలకు మరింతగా సహకారాన్ని అందించేందుకు గాను ప్రపంచబ్యాంక్ రంగంలోకి దిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయనిధిలో భాగంగా తొలివిడతలో 1.9 బిలియన్ డాలర్ల‌ను విడుదల చేయనుంది.

Latest Videos

Also Read:కోరాన్ వాక్సిన్ రెడీ అంటున్న హైదరబాదీ కంపెనీ: గతంలో స్వైన్ ఫ్లూకి కూడా...

ఈ నేపథ్యంలో భారత్‌కు 1 బిలియన్ డాలర్లు ( రూ.7,600 కోట్లు) సాయాన్ని కేటాయించింది. మనదేశంలో ఇప్పటి వరకు సుమారు 2,100 కేసులు నమోదుకాగా, 56 మరణాలు సంభవించాయి.

ఇదే సమయంలో ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకుంటే అది ఊహించడానికే వెన్నులో వణుకుపడుతుంది. దీంతో మెరుగైన స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, లాబోరేటరీల ఏర్పాటు, డయాగ్నస్టిక్స్, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, ప్రయోగశాల విశ్లేషణలకు, పీపీఈల కొనుగోలుకు ఈ నిధిని మంజూరు చేసినట్లు ప్రపంచబ్యాంక్ తెలిపింది.

Also Read:కరోనా ఎఫెక్ట్: పాన్ మసాలా, చూయింగ్ గమ్‌లపై నిషేధం

కాగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్న నేపథ్యంలో అనేక సేవలకు, సరఫరాకు ఆటంకం కలుగుతోంది. దీంతో బాధితులకు ప్రభుత్వాల ద్వారా అత్యవసర వైద్య సామాగ్రి అందించేందుకు వరల్డ్ బ్యాంక్ కృషి చేస్తోంది.

ప్రపంచబ్యాంక్ ప్రకటించిన నిధుల్లో పాకిస్తాన్‌కు పాకిస్తాన్‌కు 200 మిలియన్‌ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్ల, మాల్దీవ్స్‌కు 7.3 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని పొంద‌నున్నాయి.

click me!