అందరికీ అందుబాటులోనే వ్యాక్సిన్ ధర.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్..

By Sandra Ashok Kumar  |  First Published May 16, 2020, 2:56 PM IST

ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆట కట్టించే దిశగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక అడుగు ముందుకేశారు. వానరులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. ఇక మానవ వలంటీర్లపై జరిపే ప్రయోగ ఫలితాలు సక్సెస్ అయితే ఆగస్టు కల్లా వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చినట్లే. అయితే, వ్యాక్సిన్ ధర ప్రజలందరికి అందుబాటులో ఉంటుందని, తదనుగుణంగా ఉత్పత్తి విస్త్రుత స్థాయిలో పెంచుతామని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్ చెప్పారు. 


లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ఆట కట్టించడానికి, దాని నివారణ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాలపైనే యావత్ ప్రపంచం దృష్టి సారించింది. ఈ దిశగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఒక అడుగు ముందుకేసింది.

అయితే, ఒకవేళ పరిశోధనలు ముగిసి, విజయవంతంగా మార్కెట్లోకి వ్యాక్సిన్‌ వచ్చినా ధరపరంగా అది ఎంతమందికి అందుబాటులో ఉంటుందన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీనిపై పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అడ్రియాన్‌ హిల్‌ సదరు వ్యాక్సిన్ ధరపై తన అభిప్రాయాలను వెల్లడించారు.  

Latest Videos

undefined

వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందజేయాలన్న లక్ష్యంతోనే పరిశోధనలు సాగుతున్నాయని అడ్రియాన్ హిల్‌ తెలిపారు. ప్రయోగాలు విజయవంతమైతే ధరను నియంత్రించే విధంగా డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి  పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తక్కువ ధరలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ చేర్చేందుకు సౌకర్యంగా ఉండడమే లక్ష్యంగా పరిశోధనని సాగిస్తున్నామని అడ్రియాన్ హిల్ చెప్పారు. ‘‘ఈ వ్యాక్సిన్‌ ఖరీదు తక్కువే. ఇది సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌. గ్లోబల్‌ సప్లై చైన్‌కి అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు.

also read  కరోనా ప్యాకేజీ ఎఫెక్ట్: లక్షల కోట్ల ద్రవ్యలోటు.. తేల్చిసిన ఎస్‌బి‌ఐ

‘వివిధ ప్రదేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు. మొదటి నుంచి మా ప్రణాళిక ఇదే’’ అని అడ్రియాన్ హిల్స్‌ వివరించారు. ఇప్పటికే 10 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని.. సెప్టెంబర్ నెల నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. 

‘సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్సీవీ-19’ పేరుతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్న ఈ వ్యాక్సిన్‌పైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే కోతులపై జరిపిన ప్రయోగాలు ఆశాజనక ఫలితాలివ్వడంతో.. ఏప్రిల్‌లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభించారు. జులై లేదా ఆగస్టు నాటిని పూర్తి ఫలితాలు అందుబాటులోకి రానున్నాయని అడ్రియాన్ హిల్‌ అంచనా వేశారు. 

‘మానవులపై జరుగుతున్న ప్రయోగం జరుగుతున్న సమయంలో ఫలితాలపై వ్యాఖ్యానించడం సరి కాదు. అయితే, ప్రయోగాలు ఇంకా జరుగుతున్నాయని అంటే ఇప్పటి వరకు నిరాశపరిచే అంశాలేవీ లేవని మీరు అర్థం చేసుకోవచ్చు’’ అడ్రియాన్ హిల్ అన్నారు. 

సీహెచ్ఏడీఓఎక్స్ 1 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఏడు తయారీ కేంద్రాలకు ఉందని అడ్రియాన్ హిల్‌ తెలిపారు. వాటిలో భారతదేశంలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి కావడం విశేషం. ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పరిశోధనల్లో క్రీయాశీలకంగా పాల్గొంటోంది. మరిన్ని కేంద్రాలు చైనా, ఐరోపా దేశాల్లో ఉన్నట్లు వెల్లడించారు.

ఆరు వానరాలపై ప్రయోగించిన సీహెచ్ఏడీఓఎక్స్ 1 వ్యాక్సిన్ వాటి ఊపిరితిత్తులు దెబ్బతినకుండా సమర్థంగా అడ్డుకున్నదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. మిగతా వాటితో పోలిస్తే వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో వైరస్ లోడ్ గణనీయంగా తగ్గిందన్నారు. అధిక మోతాదులో వైరస్‌కు గురి చేసినా కరోనా న్యూమోనియా లక్షణాలు వానరాల్లో కనిపించలేదని వారు వెల్లడించారు. 

click me!