కరోనా ప్యాకేజీ ఎఫెక్ట్: లక్షల కోట్ల ద్రవ్యలోటు.. తేల్చిసిన ఎస్‌బి‌ఐ

By Sandra Ashok Kumar  |  First Published May 16, 2020, 1:19 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ.. ద్రవ్యలోటుపై 0.6శాతం మేర ప్రభావం చూపుతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అంచనా వేసింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఏర్పడుతుందని తెలిపింది.
 


ముంబై: కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీ, దేశ జీడీపీ ద్రవ్యలోటుపై 0.6 శాతం మేర ప్రభావం చూపనున్నట్లు భారతీయ స్టేట్​ బ్యాంక్ (ఎస్బీఐ) నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రకటించిన ఉద్దీపన చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్ల మేర లోటు ఏర్పడుతుందని వెల్లడించింది.

‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యల ఫలితంగా దేశ జీడీపీపై పడే ప్రభావం 0.6శాతం (సుమారు 1.29లక్షల కోట్లు) మాత్రమే. అయితే అవసరం ఉన్నవారికి రుణాలు పొందడానికి వీలుగా ప్యాకేజీ సాయం అందిస్తుంది’ ఎస్బీఐ రూపొందించిన అధ్యయన నివేదిక తెలిపింది. 

Latest Videos

‘గురువారం ప్రకటించిన రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రభుత్వ వ్యయం సుమారు రూ.14,500-రూ.14,750 లక్షల కోట్లు. గురువారం నాటి ఈ ప్యాకేజీ ద్రవ్య లోటుపై 0.07 శాతం మేర ప్రభావం చూపుతుంది’ ఎస్బీఐ పేర్కొన్నది.  

also read మోదీ ముద్దు.. భారత్ వద్దు: ఆపిల్‌పై ట్రంప్ హెచ్చరిక..

కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సమన్వయం ఉండే మౌలిక వసతులు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతను తాజా సంక్షోభం బయటపెట్టిందని ఎస్బీఐ నివేదిక పేర్కొన్నది. కార్మిక చట్టాల్లో మార్పులను సరిగా అమలు చేయగలిగితే.. దేశ కార్మికుల స్థితిగతులను మార్చవచ్చని ఎస్​బీఐ నివేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన అవగాహనతో పనిచేయాలని నొక్కి చెప్పింది.

ఇప్పటి వరకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రూ.16.45 లక్షల కోట్ల రాయితీలు ప్రకటించింది. ఇంకా రూ.3.54 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలు ప్రకటించాల్సి ఉంది. గురువారం ప్రకటించిన రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రభుత్వం కేటాయించే నిధులు రూ.14,500 కట్ల నుంచి రూ.14,750 కోట్ల ఉంటాయి.

click me!