ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌లో ఇబ్బందులు...99.8 శాతం ఇంటి వద్ద పని చేయలేరని తాజా సర్వే వెల్లడి...

By Sandra Ashok Kumar  |  First Published Apr 11, 2020, 4:23 PM IST

కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడంతో దేశీయ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాయి. కానీ వారిలో 0.2 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీకి అర్హులని, మిగతా వారికి పలు ఇబ్బందులు ఉన్నాయని ఓ సంస్థ నిర్వహించిన అధ్యనం నిగ్గు తేల్చింది.


ముంబై: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో ఐటీ రంగ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచే పనిచేసే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) వెసులుబాటు కల్పించాయి.

కానీ, ఐటీ సిబ్బందిలో 99.8 శాతం మంది ఇంటి వద్ద నుంచి సమర్థవంతంగా పని చేయలేరని తాజా సర్వే వెల్లడించింది. అత్యంత సమర్థవంతంగా పని చేయగలిగే వారు కేవలం 0.2 శాతమేనని ఎస్‌సీఐకేఈవై మైండ్‌మ్యాచ్‌ అధ్యయన నివేదిక పేర్కొంది.

Latest Videos

undefined

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉద్యోగి బలం, బలహీనతలను గుర్తించడం చాలా కీలకమని అభిప్రాయపడింది. ఉద్యోగుల ఉత్పాదకత స్థాయిని పెంచేందుకు వారి వ్యక్తిత్వాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని, పనులు కేటాయించాలని సూచించింది. 

ఒక సంస్థలోని 99.8 శాతం మంది ఉద్యోగులు కనీసం ఏదో ఒక అంశంలో అసమర్థంగా ఉన్నారని తేలింది. ఇక 16.97 శాతం మంది ఉద్యోగులకు సవాళ్లను ఛేదించడమంటే ఆసక్తి నెలకొంది. అటువంటి వారికి కొత్త సవాళ్లను అప్పగిస్తే కొద్దిపాటి సహాయంతోనే పనిని చక్కబెట్టగలరని మైండ్ మ్యాచ్ పేర్కొంది. 

సంస్థలో 17 శాతం ఉద్యోగులు కేవలం ఆదేశానుసారంగా పనిచేస్తారని, వారు తమకు నిర్దేశించిన పనిని పూర్తి చేయాలంటే యాజమాన్యాల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. 

40.42 శాతం ఐటీ సిబ్బంది తర్కంతో ముందుకెళ్తారని, అటువంటి వారికి అప్పగించే పని తర్కంతో కూడిన పని కేటాయించడంతో సత్ఫలితాలు వస్తాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు టాస్క్​లు ఇచ్చి, నిరంతరం అనుసంధానమవుతూ ఉండటం ద్వారా కావాల్సిన అవుట్​పుట్​ను రాబట్టుకోవచ్చని సూచించింది. 

అలాగే పని చేయించుకునే వారు  అడిగే ఏ చిన్న ప్రశ్నకైనా, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి. 12.7 శాతం సిబ్బంది సామాజిక సంప్రదింపులతో పని చక్కబెడుతుంటారని, వీరితో ఇంటి నుంచే పనిచేయించడం సవాలేని మైండ్ మ్యాచ్ నివేదిక వెల్లడించింది. వీరితో వీడియో కాన్ఫరెన్సింగ్‌ వంటి వర్చువల్‌ కమ్యూనికేషన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

also read లాక్‌డౌన్ ఎఫెక్ట్: అవి చూడటం ఎక్కువైంది...దీంతో తగ్గుతున్న ఇంటర్నెట్​ ‘డౌన్‌లోడ్‌’ స్పీడ్...

దాదాపు 10,000 మంది ఐటీ ఉద్యోగులపై మైండ్​టెక్​, సైకీ అనే సంస్థలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. వర్క్​ ఫ్రం హోమ్ చేయలేని 99.8 శాతం మంది ఉన్నారు. వీరిలో కొత్తగా నేర్చుకోవడం, విశ్లేషణ (95%మంది), ప్రాక్టికల్​ కమ్యూనికేషన్ నైపుణ్యాల కొరత (65%), సరైన ప్రణాళిక లేకపోవడం (71%) ఇలా ఎదో ఒక అంశంలో వెనుకబడి ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై ఆరు నెలల వరకు ఉంటుందని 72 శాతం సంస్థలు అభిప్రాయపడుతున్నట్లు ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ సర్వేలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం కల్పించడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.

నిజానికి అలాంటి వారు వారికి ఇచ్చే టాస్క్​ గురించి ఎక్కువగా భయపడనప్పటికీ.. అవసరమైనప్పుడు ఇతరులతో మాట్లాడేందుకు తరచూ వీడియో కాన్ఫరెన్స్​లు, ఫోన్ సంభాషణల ద్వారా వారి సందేహాలను తీరిస్తే మంచి ఫలితాలు వస్తాయని సర్వే విశ్లేషించింది.

మరోవైపు సైబర్‌ నేరగాళ్ల పాలిట కరోనా సంక్షోభం సదవకాశంగా మారిందని ఐటీ నిపుణులంటున్నారు. అక్రమంగా డేటా యాక్సెసింగ్‌, ఫిషింగ్‌ దాడులు పెరిగిన నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసే ఐటీ ఉద్యోగులు పలు జాగ్రత్తలు వహించాలని వారు సూచిస్తున్నారు. 

ఆఫీసు పని కోసం ఉపయోగించే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌ (సీఎస్ఐఓ) సూచిస్తున్నారు. ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నేపథ్యంలో కంపెనీ నెట్‌వర్క్‌లో రక్షణపరమైన లోపాలను గుర్తించి పరిష్కరించడం, మేధో సంపత్తి హక్కులను సంరక్షించడం, నిరంతరాయ డేటా షేరింగ్‌ కోసం సైబర్‌ సెక్యూరిటీ విభాగం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందన్నారు.

click me!