మీ బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా.. లేదంటే జరిమానా!

By Ashok kumar Sandra  |  First Published Jan 9, 2024, 5:45 PM IST

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు జరిమానాలు/చార్జెస్  విధిస్తాయి. ఈ చార్జెస్ బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. అయితే  బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు పెనాల్టీ గురించి సమాచారం మీకోసం...
 


దేశంలోని ప్రతి బ్యాంకు  సేవింగ్స్ అకౌంట్లో   మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని కస్టమర్లకు సలహా ఇస్తుంది. మీకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే, అకౌంట్లో  మినిమమ్  మొత్తాన్ని జమ చేయనందుకు ఎలాంటి జరిమానా ఉండదు. అలాగే  ప్రతి కస్టమర్ సాధారణ సేవింగ్స్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్  ఉంచాలి.

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు జరిమానాలు/చార్జెస్  విధిస్తాయి. ఈ చార్జెస్ బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. అయితే  బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు పెనాల్టీ గురించి సమాచారం మీకోసం...

Latest Videos

undefined

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ర్లు బేసిక్ సేవింగ్స్ అకౌంట్లో  ప్రతినెలా  ఆవరేజ్ బ్యాలెన్స్ నిబంధన రద్దు చేయబడింది. ఇంతకు ముందు, కస్టమర్ పట్టణం ఇంకా  గ్రామాన్ని బట్టి రూ. 3000 నుండి రూ. 1000 వరకు మొత్తాన్ని ఉంచాల్సి  వచ్చేది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్‌లు కనీసం రూ.10,000 లేదా రూ.1లక్ష FD ఉండాలి. అంతే కాకుండా, మీరు కనీసం ప్రతినెల ఆవరేజ్  బ్యాలెన్స్‌ను రూ.5,000 ఉంచాలి. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో, రూ. 2,500 లేదా రూ. 25,000 FD త్రైమాసిక బ్యాలెన్స్ అవసరం.

ICICI బ్యాంక్‌లో సాధారణ సేవింగ్స్ అకౌంట్లో  ఆవరేజ్  మినిమమ్  బ్యాలెన్స్  రూ.10,000గా నిర్ణయించబడింది. పట్టణ శాఖల్లో రూ.5,000, గ్రామీణ శాఖల్లో రూ.2,000 మినిమమ్  బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది.

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో మెట్రో నగరాల్లో రూ. 5,000 నుండి 10,000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ. 2,000 ఇంకా  గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రూ. 1,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన  అవసరం ఉంటుంది.

కెనరా బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే  గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, సెబీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,000, మెట్రో నగరాల్లో రూ.2,000 ఆవరేజ్ మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయడం అవసరం ఉంటుంది.

click me!