భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చనప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని పూర్తికాల బడ్జెట్ లు, ఎన్ని మధ్యంతర బడ్జెట్ లు..ఎన్ని మినీ బడ్జెట్ లు సమర్పించారో తెలిస్తే.. దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థం అవుతుంది.
ఢిల్లీ : ఇది ఎన్నికల సమయం.. ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను గురువారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ ను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో వార్షిక ఆర్థిక ప్రకటనగా పేర్కొన్నారు. భారత రిపబ్లిక్ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆదాయ, వ్యయ, సంక్షేమ, అభివృద్ధిలతో తయారు చేస్తుంది.
ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రభుత్వ రంగ వ్యయ విభాగం ద్వారా సేకరించిన వ్యయాలను గుర్తించడానికి రెవెన్యూ శాఖ ద్వారా వివరాలు సేకరిస్తారు.
యేటా ఈ బడ్జెట్ ను ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి రోజున ప్రవేశపెడుతుంది. తద్వారా ఇది ఏప్రిల్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు కార్యరూపం తీసుకుంటుంది. 2016 వరకు ఆర్థిక మంత్రి పార్లమెంటులో దీనిని ఫిబ్రవరి చివరి పనిదినం నాడు సమర్పించేవారు.
Union Budget 2024 : బడ్జెట్ 10 సూత్రాలు ఇవే...
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ బడ్జెట్ విభాగం బడ్జెట్‌ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది.
ఇది ఆర్థిక బిల్లు ద్వారా సమర్పించబడుతుంది. మనదేశ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. అప్పటినుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనికంటే ముందు ఈ విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
బడ్జెట్ సమర్ఫణ కార్యక్రమాన్ని DD నేషనల్, DD న్యూస్, సంసాద్ TVలో సంసద్ భవన్ నుండి బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఇది ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు అంతరాయం లేకుండా లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
సాధారణంగా బడ్జెట్‌లో మార్పులు, ప్రయోజనాలు, లోపాలను అంచనా వేసే ప్యానెల్ నివేదికను అనుసరిస్తుంది.
అదనపు బడ్జెట్ పత్రాలు, మెటీరియల్‌లు, ప్రభుత్వ బడ్జెట్ వెబ్‌సైట్, యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
రైల్వై బడ్జెట్ స్వాత్రంత్ర్యపూర్వనుంచి విడిగా సమర్పించబడేది. 92 సంవత్సరాల తరువాత కేంద్ర బడ్జెట్‌తో విలీనం చేయబడింది.
1947 నుండి ఇప్పటివరకు, మొత్తం 73 వార్షిక బడ్జెట్‌లు, 14 మధ్యంతర బడ్జెట్‌లు, నాలుగు ప్రత్యేక బడ్జెట్‌లు లేదా చిన్న బడ్జెట్‌లు సమర్పించబడ్డాయి.