కరోనా విశ్వమారి విశ్వరూపం తర్వాత భారతదేశంలోని అర్బన్–రూరల్ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొనుగోలు విషయంలో భిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. అర్బన్ ప్రాంత వాసులు పెద్ద పెద్ద ప్యాక్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇక గ్రామీణులు విలువైన ప్యాక్ లకే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: సబ్బులు, షాంపులు, డిటర్జెంట్లు వంటి ఎఫ్‌ఎంసీజీ వస్తువుల కొనుగోళ్ల విధానాన్ని కరోనా వైరస్ విశ్వమారి పూర్తిగా మార్చేసింది. ఈ వస్తువుల కొనుగోళ్ల విషయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. పెద్ద నగరాల్లోని వినియోగదారులు పెద్ద పెద్ద ప్యాక్‌లను కొంటున్నారు.
చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వారు వాల్యు ప్యాక్‌లను కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ ప్లేయర్లు చెబుతున్నారు. సప్లయి చెయిన్లు, ప్రొడక్ట్‌ల అందుబాటు మెరుగుపడ్డాక నాన్ మెట్రో మార్కెట్లలో అఫర్డబుల్ ప్యాక్‌ల లేదా పాపులర్ ప్రైస్ ప్రొడక్ట్‌ల(పీపీపీ) వినియోగం పెరిగే అవకాశం ఉందని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, పార్లే ప్రొడక్ట్స్, విప్రో కన్జూమర్ కేర్ వంటి ఎఫ్‌ఎంసీజీ సంస్థలు చెబుతున్నాయి.
undefined
ఇదే సమయంలో అర్బన్ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ప్యాక్ ఐటమ్ కొనుగోళ్లకే కన్జూమర్లు మొగ్గు చూపుతారని కంపెనీలు పేర్కొంటున్నాయి. స్టోర్లకు వచ్చిన ప్రతిసారి పెద్ద మొత్తంలో కొంటుంటారని చెప్పాయి. ఇలా పెద్ద మొత్తంలో ఒకేసారి కొంటూ పదేపదే స్టోర్లకు రావడాన్ని కూడా వీరు తగ్గిస్తారని కంపెనీ చెబుతున్నాయి.
హైపర్ మార్కెట్లు, రిటైల్ స్టోర్లకు కన్జూమర్లు తమ రాకపోకలను తగ్గిస్తారని కూడా కంపెనీలు అంచనావేస్తున్నాయి. కొన్ని నెలల వరకు మెట్రోల్లో ప్రొడక్ట్‌ల పెద్ద ప్యాక్‌లే ఎక్కువగా అమ్ముడుపోతాయని కంపెనీలు చెప్పాయి. కరోనా మహమ్మారి పాపులర్ ప్రైస్ ప్రొడక్ట్‌లకు (పీపీపీ) ఒక అవకాశంగా మారిందని నెస్లే ఇండియా చెప్పింది.
రూరల్ మార్కెట్లలో ప్రజాదరణ పొందిన వస్తువుల సేల్స్ పెరుగుతాయని నెస్లే ఇండియా వివరించింది. ‘సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లలో చిన్న ప్యాక్‌ల కొనుగోళ్లే బెటర్‌గా భావించడం మీరు చూస్తారు’ అని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ తెలిపారు.
also read
కరోనా లాక్‌డౌన్‌తో వలస కూలీలు కూడా తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటికే వీరు నగరాల్లో కొన్ని రోజుల పాటు ఉండటంతో, బ్రాండ్ల గురించి కాస్తో కూస్తో తెలుసుకుని ఉంటారు. రూరల్ ఏరియాల్లో వీరు ఈ బ్రాండ్లను కోరే అవకాశం ఉందని నారాయణన్ అన్నారు.
డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ లలిత్ మాలిక్ స్పందిస్తూ..‘చాలా మంది వలస కూలీలు వారి వారి ఇళ్లకు, గ్రామాలకు వచ్చేశారు. రూరల్ ఇండియాలో తక్కువ ధర లేదా అఫర్డబుల్ ప్యాక్‌లకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది’ అని లలిత్ చెప్పారు. ఖర్చులను, డిమాండ్‌ను పెంచేందకు ప్రభుత్వం ఇటీవలే రిలీఫ్ ప్యాకేజీని కూడా తీసుకొచ్చింది. అంతేకాక ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కి కూడా కేటాయింపులను పెంచింది. దీంతో రూరల్ కన్సంప్షన్ పెరిగే అవకాశం ఉందని వివరించారు.
ఆర్థిక కారణాలతో అర్బన్ ప్రాంత ప్రజలు పెద్ద ప్యాక్‌లను కొంటే, రూరల్ ప్రాంత ప్రజలు వాల్యు ప్యాక్‌లను కొంటారని జీసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వివేక్ గంభీర్ తెలిపారు. చిన్న చిన్న ప్యాక్‌లు (సాషే) మస్తు ఫేమస్‌గా మారతాయని చెప్పారు. ఇదే సమయంలో, కొన్ని సెగ్మెంట్లలో, మనీకి కూడా ఎక్కువ విలువ ఇస్తారని తెలిపారు.
ఇన్ని రోజులు ప్రతి వారం సూపర్ లేదా హైపర్ మార్కెట్ వెళ్లే పట్టణ ప్రజలు.. ఇక నుంచి రెండు లేదా మూడు వారాలకు ఒకసారి మార్కెట్లకు వెళ్తుంటారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా అన్నారు. ఎందుకంటే, వారు వెళ్లినప్పుడే ఎక్కువ ఐటమ్స్ కొనేసుకుంటారని తెలిపారు.
రూరల్ మార్కెట్లలో సొంత ఇంటికి చేరిన లేబర్.. తాము సంపాదించే మొత్తం నుంచి కొంత మొత్తాన్ని సేవింగ్స్‌కు పెట్టుకుంటారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా చెప్పారు. దీంతో వీరు ప్రీమియం ప్రొడక్ట్ వాల్యు ప్యాక్‌ను కొనకుండా.. అఫర్డబుల్ ఐటమ్ వాల్యు ప్యాక్‌ను కొంటారని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వాల్యు ఐటమ్స్ కొనుగోళ్లు పెరుగుతాయని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. సప్లయ్ చెయిన్లు పూర్తిగా కోలుకున్నాక, ప్రొడక్ట్‌ల అందుబాటు పెరిగాక, కన్జూమర్లు చిన్న వాల్యు ప్యాక్‌లను ఎక్కువగా కొనడం ప్రారంభిస్తారని విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ చెబుతోంది. ఖర్చుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారని విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పీ ప్రసన్న రాయ్ తెలిపారు.